Asianet News TeluguAsianet News Telugu

కరుడుగట్టిన ఉగ్రవాదిలా మారాడు: మందడంలో జగన్‌పై బాబు ఫైర్

సంక్రాంతి సందర్భంగా  బుధవారం నాడు మందడంలో చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. 

Chandrababunaidu sensational comments on Ys jagan
Author
Amaravathi, First Published Jan 15, 2020, 1:32 PM IST

అమరావతి: భవిష్యత్ లో జగన్ లాంటి ఉగ్రవాది లాంటి ముఖ్యమంత్రిని తాను చూడనని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కన్నెత్తి చూడడం లేదని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆయన సతీమణి భువనేశ్వరీ, కోడలు నారా బ్రహ్మణిలు బుధవారం నాడు మందడంలో రైతుల దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు. 

 తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర చేసాడు,నిన్న సంక్రాంతి పండుగకు ఎడ్ల పందెలకి వెళ్ళాడని జగన్ తీరుపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను ఎందుకు ఓదార్చడం లేదని  చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 

రైతులు చేస్తున్న ఆందోళన చూస్తుంటే గుండె తరుక్కు పోతుందని చంద్రబాబు చెప్పారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, న్యాయం మీ వైపే ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు  29 గ్రామాల్లో  రిటర్న్ బుల్ ఫ్లాట్స్ ఇచ్చిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. అమరావతి,పోలవరం రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివన్నారు. 

ఈ రెండు ప్రాజెక్టులను దెబ్బతీశారని చంద్రబాబునాయుడు విమర్శించారు. జగన్ తీరుతో ఏపీ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు చెప్పారు.సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి ఆనందంగా ఉండే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని చంద్రబాబు అన్నారు.

సంక్రాంతి కోసం నారా వారి పల్లెకు కూడా తాను కూడ వెళ్లలేదన్నారు. అమరావతి అనేది 29గ్రామాల సమస్య కాదు.అమరావతి 5కోట్ల ప్రజల సమస్య.గా చంద్రబాబునాయుడు తెలిపారు. 

శివ రామ కృష్ణ కమిటీ రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పింది. కానీ మూడు రాజధానులు పెట్టమని చెప్పలేదని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  
విజయవాడలో గుంటూరు మధ్య రాజదాని ఉంటే అందరికి అనుకూలంగా ఉంటుందని శివ రామకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని ఆయన ఈ సభలో ప్రస్తావించారు. 

వైసీపీ నేత సాంబశివరావు 2014 ఎన్నికల్లో  వైసీపీకి ఓటు వేశారు.2019ఎన్నికల్లో కూడా అది వైసీపీకి సాంబశివరావు వైసీపీకి పని చేసారూ కానీ రాజదానిపై వారికి ఒక తటస్థ అభిప్రాయం ఉందన్నారు. 

Also read:రాజధాని రచ్చ: పండుగ పూట గుండెపోటుతో ఇద్దరు రైతుల మృతి

సంక్రాంతి పండుగ స్పూర్తితో రాజధాని తరళింపుకు వ్యతిరేకంగా పోరాడదామని చంద్రబాబు రైతులను కోరారు. రాజధాని ఉత్తరాంధ్రలో పెట్టమని అక్కడి ప్రజలు ఆడిగారా అని చంద్రబాబు జగన్ ను ప్రశ్నించారు. 

మందడంలో ఎప్పుడు వరదలు వచ్చాయో ప్రభుత్వం నిరూపించాలన్నారు. వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ,సెక్రటేరియట్ నిర్మాణలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

Also Read:జగన్ వెన్నుపోటు పొడిచాడు:అమరావతి రైతుల దీక్షలో వంగవీటి రాధా

కోర్టు చెప్పిన ప్రభుత్వం తీరు మారడం లేదని చంద్రబాబు జగన్ తీరుపై మండిపడ్డారు. పోలీసుల తీరుపై కోర్టు ఆశ్రయిస్తామని చంద్రబాబు చెప్పారు. జోలే పట్టుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతుంది తన కోసం కాదన్నారు.రాష్ట్ర శ్రేయస్సు కోసం పోరాడుతున్న రైతుల కోసమేనని చంద్రబాబు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios