విజయవాడ: తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఏడాది, ఏడాదిన్నరలో ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన అన్నారు. వైఎస్ జగన్ నమ్మకాన్ని కోల్పోయారని ఆయన అన్నారు. 

కుల ద్వేషం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.సీఎం అవుతూనే వైఎస్ గన్ రాజధానినే మార్చాలని అనుకున్నారని ఆయన అన్నారు. జగన్.కృష్ణా-గోదావరి నదుల వల్లే ఈ ప్రాంతంలో డబ్బు ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.మెజార్టీ భూములు కొని ఉండొచ్చేమో కానీ.. కమ్మ వాళ్లు మాత్రమే భూములు కొనలేదని అన్నారు. గత ఏడు నెలల కాలంగా విజయ సాయి ఢిల్లీ-విశాఖ మధ్య తిరిగారని ఆయన అన్నారు. 

డబ్బులున్న వాళ్లొచ్చి భూములు కొంటే.. రైతులకేం నష్టమని అన్నారు.ఒకే ఒక్క డీల్ లో జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుతున్నారని.గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేశారని జేసీ అన్నారు. కేసీఆర్ విషయంలో జగన్ గురు భక్తి చాటుకున్నారని అన్నారు.

మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం శ్మశానం అవుతుందని, చంద్రబాబు కష్టపడి పరిశ్రమలు తెచ్చారని, అవి హైదరాబాదుకు తరలిపోతున్నయని ఆయన అన్నారు. నిన్న చంద్రబాబు సీఎం, ఇవాళ జగన్ సీఎం అని, ఎవరు సీఎం అయినా నమ్మకాన్ని పెంచాలని ఆయన అన్ారు. 

విశాఖపట్నంలో వైసీపీవాళ్లు భూములు కొన్నారని, అందుకే విశాఖకు తరలిపోవాలని జగన్ అనుకుటున్నారని ఆయన అన్నారు. రాజధాని అంటే జగన్ ఒక్కడి నిర్ణయం కాదని ఆయన అన్నారు. మాటలతో ఈ ప్రభుత్వానికి అర్థం కాదని, ఈడ్చి కొట్టాలని ఆయన అన్నారు. జైలో భరో కార్యక్రమం చేపట్టాల్సినన అవసరం ఉందని జేసీ అన్నారు.

మూడు రాజధానులు చేసేయ్ అని కేసీఆర్ జగన్ కు చెప్పారట అని జేసీ అన్నారు. .ఏపీలోని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని అన్నారు. ఏపీపై నమ్మకం.. విశ్వాసం పోయిందని, అందుకే పరిశ్రమలు పోయాయని అన్నారు.