మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో చిక్కుముడులు ఇవే...
మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో ఇంకా చిక్కుముడులు వీడడం లేదు. హత్యకు ముందు నాలుగు రోజులు ఏం జరిగింది. ఇంటికి ఎవరెవరు వచ్చిపోయారనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో చిక్కుముడులు చాలానే ఉన్నట్లు అనిపిస్తోంది. చివరి నాలుగు రోజులు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్యకు ముందు నాలుగు రోజులు ఏం జరిగిందనేదే కేసులో కీలకంగా మారింది.
గత మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి అక్కాచెల్లెళ్లు అలేఖ్య, సాయి దివ్య శివననగర్ ఇంట్లోనే ఉంటున్నారు. వారికి సోషల్ మీడియాలో ఖాతాలున్ాయి. ఇన్ స్టాగ్రామ్ లో తాము తీసుకున్న ఫొటోలను పోస్టు చేయడం వారికి అలవాటు. వాటిలో తాము ఆరాధిచే ఓషో ఫొటోలను, తమపై ప్రబావం చూపించిన విషయాల పోస్టింగు పెడుతూ వచ్చారు.
Also Read: శివుడి రోమాల నుంచి కరోనా : స్వర్గాన్ని నాశనం చేశాడని భర్తపై పద్మజ
హత్యకు గురి కావడానికి మూడు రోజుల ముందు నుంచి, అంటే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం ఏ విధమైన పోస్టింగులు లేవు. దానికి ముందు గురువారంనాడు చివరగా పెట్టిన పోస్టింగ్ శివ ఈజ్ కమింగ్.. వర్క్ ఈజ్ డన్ అనేది. దానితో పాటు ఓ మైనారిటీ మతంపై అభ్యంతరకరమైన పోస్టింగు కూడా పెట్టారు.
ఆ తర్వాతనే కీలకమైన సంఘటనలు చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. శుక్రవారం నుంచి ఆ ఇంటి నుంచి పెద్దగా అరుపులు, కేకలు, గంటలు వాయిస్తున్న శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు ఇంట్లో పూజలు జరిగాయని అంటున్నారు. మాంత్రికులు ఇంటికి వచ్చి వెళ్తూ కనిపించారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పద్మజ ఇద్దరు కూతుళ్లతో ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయించడాన్ని చుట్టుపక్కల వాళ్ల గమనించారు అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ ప్రాంతంలో నీళ్లు వదిలిన విషయం చెప్పడానికి ఇంటి వద్దకు వాటర్ మ్యాన్ వచ్చాడు. ఇంట్లోంచి గంటల శబ్దం వినిపించిందని, దాంతో పూజలు జరుగుతున్నాయని భావించినట్లు అతను చెబుతున్నాడు.
Also Read: మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: వెలుగులోకి మరిన్ని దిమ్మ తిరిగే విషయాలు
దాదాపు 4.30 గంటల ప్రాంతంలో పాలు పోయడినికి వచ్చిన వ్యక్తి పిలిచాడు. అప్పుడు బాల్కనీ నుంచి పురుషోత్తంనాయుడు పాలు వద్దని చెప్పాడు. దాంతో తిరిగి వెళ్లిపోయాడు. దాంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఇంట్లో పూజలు జరిగియానేది తెలుస్తోంది. అయితే, పూజలు చేయడానికి, కూతుళ్లను హత్య చేయడానికి కారణాలు ఏమిటన్నది తెలియడం లేదు.