హోరాహోరీగా జరుగుతుందనుకుంటున్న నంద్యాల ఉపఎన్నికలో ఓటర్లు  ఓటుహక్కు వినియోగించుకోటవంపైనే ఆధారపడివుంది. సాధారణంగా ఓటర్లలో ఎక్కువమంది ఓటింగ్ కు వెళ్ళటానికి పెద్ద ఆసక్తి చూపరు. ఇందుకు పోయిన ఎన్నికే నిదర్శనం 2014లో ఎన్నికల్లో 2.3 లక్షల ఓట్లకు గాను పోలైంది కేవలం 1.75 లక్షలు మాత్రమే. అంటే పోలైంది 75.82 శాతమే.

హోరాహోరీగా జరుగుతుందనుకుంటున్న నంద్యాల ఉపఎన్నికలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోటవంపైనే ఆధారపడివుంది. అంటే పోటీలో ఉన్న పార్టీలన్నీ ఓటర్లను పోలింగ్ బూత్ దాకా వచ్చేలా చేయగలగాలి. ఓటర్లు పోలింగ్ బూత్ దాకా రావాలంటే ఆ వాతావరణం ఉండాలి కదా ముందు. సాధారణంగా ఓటర్లలో ఎక్కువమంది ఓటింగ్ కు వెళ్ళటానికి పెద్ద ఆసక్తి చూపరు. ఇందుకు పోయిన ఎన్నికే నిదర్శనం. 2014లో ఎన్నికల్లో 2.3 లక్షల ఓట్లకు గాను పోలైంది కేవలం 1.75 లక్షలు మాత్రమే. అంటే పోలైంది 75.82 శాతమే.

అప్పుడు కూడా వైసీపీ, టిడిపి అభ్యర్ధుల మధ్య పోటీ తీవ్రంగా జరిగింది. అందుకే టిడిపి-వైసీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం 2.06 శాతమే. అప్పట్లో టిడిపి అభ్యర్ధి శిల్పామోహన్ రెడ్డికి 78590 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్ధి భూమానాగిరెడ్డికి 82194 ఓట్లు వచ్చాయి. భూమాకు వచ్చిన మెజారిటీ కేవలం 3600 మాత్రమే. అంత హోరాహోరీగా జరిగిన ఎన్నికలో కూడా భూమాకు వచ్చిన మెజారిటీ తక్కువే. అంత తక్కువ మెజారిటీతో గెలవటానికి ప్రధాన కారణం భార్య శోభా నాగిరెడ్డి మరణమే అన్న విషయం అందరికీ తెలిసిందే.

పోయిన ఎన్నికలో పోలింగ్ కు ముందు శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించటం నాగిరెడ్డికి కలిసివచ్చి కొద్దిపాటి మెజారిటీతో బయటపడ్డారు. లేకపోతే అప్పట్లో ఏం జరిగేదో. పోలైన ఓట్లే తక్కువ. అందులో కూడా వైసీపీ-టిడిపిల మధ్య ఓట్లశాతం ఇంకా తక్కువ. దాదాపు 55 వేల ఓట్లు పోలవ్వలేదు. ఈసారి కూడా అదే రిపీటైతే ముఖ్యంగా వైసీపీకి బాగా నష్టం.

ఓటింగ్ తక్కువుంటే ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీకే నష్టం. అధికారంలో ఉన్న పార్టీపై జనాల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు పోలైతే అందులో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ప్రతిపక్ష పార్టీలకే పడతాయనటంలో సందేహంలేదు. అదే సూత్రం రేపటి ఎన్నికల్లో కూడా వర్తిస్తుంది.

అంటే, ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలనుంటున్న వైసీపీ ఓటింగ్ ను పెంచుకోవటంపైన కూడా దృష్టి పెట్టాల్సిందే. అభ్యర్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయటం ఒకఎత్తు, అభ్యర్ధి నియోజకవర్గాన్ని చుట్టిరావటం ఇంకోఎత్తు. ఎవరెంత చేసినా ఓటర్లను పోలింగ్ బూత్ దాకా తీసుకుని రాలేకపోతే మాత్రం అధికార పార్టీనే లబ్ది పొందుతుదనటంలో అనుమానం అవసరం లేదు.