వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసినట్లు చెబుతున్న ట్వీట్ పై గందరగోళం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 175 సీట్లలో పోటీ చేస్తామని పవన్ ట్వీట్ చేసినట్లుగా సోమవారం బ్రేకింగ్ న్యూస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసినట్లు చెబుతున్న ట్వీట్ పై గందరగోళం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 175 సీట్లలో పోటీ చేస్తామని పవన్ ట్వీట్ చేసినట్లుగా సోమవారం బ్రేకింగ్ న్యూస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో మీడియా ఫోకస్ మొత్తం పవన్ ట్వీట్లపైనే కేంద్రీకృతమైంది. అయితే, తాజాగా వినిపిస్తున్న మాటేంటంటే అసలు ఆ ట్వీట్లను పవన్ పెట్టనేలేదని. పవన్ ట్వట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని ఒకసారి, పవన్ ట్వీట్టర్ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ కాదని మరో వాదన వినిపిస్తోంది.
తాజాగా వినిపిస్తున్నది ఏంటంటే, జనసేన ట్విట్టర్ అకౌంట్ నుండి జనసేన సోషల్ మీడియాలోని ఓ సైనికుడు అత్యుత్సాహంతో తొందరపడి పవన్ పేరుతో 175 సీట్లలో పోటీ అంటూ ట్వీట్ చేసారట. ఆ మధ్య జనసైనికులతో పవన్ సమావేశం జరిపారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్ధానాల సంఖ్యపై చర్చ జరిగిందట. ‘‘అప్పటి మన బలం ఆధారంగా, గెలిచే సీట్లేవో చూసుకుని పోటీ విషయమై నిర్ణయానికి వద్దా’’మంటూ పవన్ చెప్పారట.
అయితే, అదే విషయాన్ని ఓ సైనికుడు తప్పుగా అర్ధం చేసుకుని పవన్ మాటలకు ఓ సంఖ్యను జత చేసి ట్వీట్ చేసారంటూ జనసేన వర్గాలు చెబుతున్నాయి. కనీసం ఈ వాదనైనా నమ్మొచ్చా? ఏంటో అంతా అయోమయమే. ఇందులో ఏది నిజం? ఏది అబద్దమో తెలీక జనాలు గందరగోళంలో పడుతున్నారు. లేకపోతే పవన్ పేరుతో ట్వీట్ మొదలవ్వగానే తెరువెనుక ఇంకేదైనా జరిగిందా? అసలు ఈ విషయంలో పవనే మీడియా ముందుకొచ్చి ఓ స్టేట్ మెంట్ ఇస్తే సరిపోతుంది కదా?
