లోకేశ్ కు మొదటి ఛాలెంజ్ ఎదురయింది

lokesh holds first high level talks with global software major apple
Highlights

ఇది ఆయన ఐటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జరిగిన తొలి పెద్ద సమావేశం. చాలా ప్రతిష్టాత్మక సమావేశం

 

కాన్ఫిడెన్సియల్ న్యూస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి లోకేశ్  బాబు  చాలా గోప్యంగా ఒక కీలక సమావేశం నిర్వహించారు.

 

ఇది ఆయన ఐటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జరిగిన తొలి పెద్ద సమావేశం. చాలా ప్రతిష్టాత్మక సమావేశం. సంస్థ ఏదో తెలుసా, ఐటి గ్లోబల్ కంపెనీ యాపిల్.

 

ఈ సమావేశం వివరాలేవీ వెల్లడించడం లేదు. ఎందుకంటే,ఈ మధ్యే బెంగుళూరులో యూనిట్ పెట్టిన యాపిల్ ఎలా స్పందిస్తోతెలియదు. ఐటి మంత్రిగా ఆయన ఒక అంతర్జాతీయ సంస్థతో సమావేశం కావడం ఇదే ప్రథమం ఇది విజయవంతం అయితే, పండగే.

 

ఎలాగయినా సరే, ఆయన మంత్రయ్యాకే  ఐటి దిగ్గజాలు ఆంధ్రవైపు చూస్తున్నాయని,  గ్లోబల్ ఐటి కంపెనీలను ఆంధ్రకి తీసుకురావడంలో లోకేశ్ విజయవంతమయ్యాడని నిరూపించేందుకు ప్రభుత్వంలో చాలా కృషి జరుగుతూ ఉంది.యాపిల్ ఒప్పుకుంటే ఈ యూనిట్ ను తిరుపతి సమీపంలో ఏర్పాటుచేయాలని ప్లాన్.

 

 ఆ మధ్య హైదరాబాద్ లో   తెలంగాణా ఐటి మంత్రి కెటిఆర్ టి హబ్ పేరుతో ఎలా హంగామా సృష్టించారో అలాంటి ఐటి సందడి ఆంధ్రలో కూడా వచ్చే ఎన్నికల లోపు, సృష్టించేందుకు తెరవెనక చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా యాపిల్ ప్రతినిధుల బృందమొకటి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఐటి మంత్రి లోకేశ్ ని  వెలగపూడిలో కలిసింది.

 

ఈచర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున వివరాలు వెల్లడించరాదని నిర్ణయించారు. యాపిల్ ను లాక్కుపోయేందుకు అనేక రాష్ట్రాలుపోటీపడుతుండటంతో చిన్న బాబు పెద్ద చర్చలు కాన్ఫిడెన్సియల్  అయ్యాయి.

 

ఇండియాలో అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్  బెంగళూరులో వస్తూ ఉంది.యాపిల్ బెంగుళూరు తీసుకెళ్లడంతో కర్నాటక ప్రభుత్వం విజయవంతమయింది. 

 

యాపిల్  నిర్ణయంతో  విదేశీయులు పెట్టుబడులు పెట్టేందుకు బెంగళూరు అత్యుత్తమ స్థానం అని మరొక సారి రుజువయిందని  కర్నాటక ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ఉంది. ఇప్పటిదాకా ఆంధ్రాకి గ్లోబల్ కంపెనీలేవీ రాలేదు. ఒకయూనిట్ ను స్థాపించేందుకు యాపిల్ లాంటిసంస్థలను వప్పిస్తే విదేశీ పెట్టుబడులకు ఆంధ్ర బాగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆ ఘనత లోకేశ్ కు దక్కుతుంది.

 

లోకేశ్ నిన్న  ముగ్గురు యాపిల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు చాలా పెద్ద చర్చలని, కీలకమయిన చర్చలని అధికారులు చెబుతున్నారు.

 

లోకేశ్ కు ఇది పెద్ద పరీక్షే.

 

 

 

 

loader