‘నంది’ వివాదంపై నోరిప్పిన లోకేష్

‘నంది’ వివాదంపై నోరిప్పిన లోకేష్

నంది అవార్డులపై జరుగుతున్నగొడవను నారా లోకేష్ చాలా లైట్ గా తీసుకున్నారు. ఏపిలో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. సోమవారం మాట్లాడుతూ నంది అవార్డల ప్రధానంపై జరుగుతున్న వివాదాన్ని చాలా తక్కువ చేయటానికి ప్రయత్నించారు. అవార్డులపై ఇద్దరు, ముగ్గురు మాత్రమే విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అవార్డుల జ్యూరిలో సభ్యులు కూడా విమర్శలు చేయటమేంటంటూ ధ్వజమెత్తారు. మూడేళ్ళ అవార్డులు ఒకేసారి ఇచ్చినందుకు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయటం అర్ధరహితమన్నారు. అసలు అవార్డులే ఇవన్ని ప్రభుత్వాన్ని ఇవే అవార్డులపై ప్రశ్నించే దమ్ముందా అంటూ సవాలు చేయటం విచిత్రంగా ఉంది. మొత్తం మీద లోకేష్ తన తండ్రి, ముఖ్యమంత్రైన నారా చంద్రబాబునాయుడు, మావగారైన నందమూరి బాలకృష్ణలపై కొద్ది రోజులుగా రేగుతున్న వివాదంపై నోరిప్పారు. అయితే, లెజెండ్ కు ఏకంగా 9 అవార్డులు రావటాన్ని మాత్రం సమర్ధిస్తూ ప్రకటన మాత్రం చేసే ధైర్యం చేయలేదు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page