ట్విట్టర్ లో సమాధానమిస్తూ, ‘ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా స్ధానిక అధికారులను అలర్ట్ చేస్తా’నని హామీ కూడా ఇచ్చారు.
ట్విట్టర్లో వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించటంలో నారా లోకేష్ తెలంగాణా మంత్రి కెటిఆర్ తో పోటిపడుతున్నట్లున్నారు.
ఈరోజు ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహరావు అనే యువకుడు ట్వట్టర్ ద్వారా లోకేష్ దృష్టికి ఓ సమస్య ఈరోజు తెచ్చారు. తమ గ్రామంలో బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు ఫిర్యాదు చేసారు. ఒక బెల్ట్ షాపు ఫొటోను కూడా ఫిర్యాదుకు జత చేసారు. చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్న ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు.
లోకేష్ గ్రామీణాభృద్ధి శాఖకు కూడా మంత్రే కాబట్టి తక్షణమే స్పందించాల్సిన బాధ్యత లోకేష్ మీదుంది. ట్వట్టర్ పోస్టు చూడగానే లోకేష్ కూడా ‘ఏంటి ఇది బెల్ట్ షాపా’అంటూ ఆశ్చర్యపోయారు. వెంటనే ట్విట్టర్ లో సమాధానమిస్తూ, ‘ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా స్ధానిక అధికారులను అలర్ట్ చేస్తా’నని హామీ కూడా ఇచ్చారు.
అయితే, అదే హామీలో ‘సమస్య ఇంకా కొనసాగుతున్నట్లైతేనే అధికారులపై చర్యలు తీసుకుంటా’ అని హామీ కూడా ఇచ్చారు. దాంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై లోకేష్ ఇంత తొందరగా స్పందిస్తారని అధికారులు అనుకోలేదట.
