తిరుపతి:తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలోని శ్రీవారి పాదాల పర్యాటక కేంద్రం వరకు ఆర్టీసీ బస్సును ఆర్టీసీ బస్సు ట్రయల్ రన్ ను గురువారం నాడు నిర్వహించారు. ఈ బస్సు ట్రయల్ రన్ లో గుర్తించిన లోటు పాట్ల ఆధారంగా రోడ్డులో మార్పులు చేర్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

లాక్‌డౌన్ కు ముందు వరకు తిరుమలలోని పాపవినాశనం వద్దకు ఆర్టీసీ బస్సులను నడిపేది. శ్రీవారి పాదాల మార్గం వద్ద కొన్ని చోట్ల ఎత్తు పల్లాలతో పాటు రోడ్డు మార్గం ఇరుకుగా ఉంది. దీంతో బస్సులను నడపడం లేదు.

గురువారం నాడు ఓ ఆర్టీసీ బస్సుతో ఈ ప్రాంతంలో ట్రయల్ రన్ నిర్వహించారు. బస్సు ట్రయల్ రన్ సమయంలో  బస్సు మలుపులు తిరగడం ఇబ్బందిగా ఉన్నట్టుగా  డ్రైవర్ అధికారులకు చెప్పారు. మరో వైపు రోడ్డు కూడ సరిగా లేని విషయాన్ని కూడ ఆయన అధికారులకు చెప్పారు.

also read:భక్తులకు వెంకన్న దర్శనం: టీటీడీ ప్లాన్ ఇదీ, కానీ.....

డ్రైవర్ చెప్పిన ప్రకారంగా ఈ ప్రాంతంలో రోడ్డును కొద్ది దూరం పాటు వెడల్పు చేయడంతో పాటు ఎత్తు పల్లాలు ఉన్న చోట రోడ్డును సమానం చేయనున్నారు.

ఈ మేరకు ఆర్టీసీ అధికారులు టీటీడీకి నివేదిక ఇవ్వనున్నారు.తిరుమలలో దేవాలయ అవసరాలతో పాటు స్థానికులు, వ్యాపారుల సరుకుల రవాణాకు కార్గో సర్వీసులను ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: రూ. 400 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ

లాక్ డౌన్ ఎత్తివేస్తే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిచ్చిన తర్వాత బస్సులు తిరుమలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే బస్సుల్లో కూడ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.

మూడు సీట్లలో ఇద్దరు, రెండు సీట్లలో ఒక్కరు మాత్రమే కూర్చొనే వెసులుబాటును కల్పించనున్నారు.  ప్రస్తుతం 49 సీట్లలో 30 మంది, 47 సీట్ల బస్సులో 28, 45 సీట్ల బస్సులో 25 మంది ప్రయాణీకులను మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.