Asianet News TeluguAsianet News Telugu

కేజీహెచ్ వద్ద ఎల్జీ పాలీమర్స్ బాధితుల ధర్నా

ఎల్జీ పాలీమర్స్ బాధితులు మంగళవారం నాడు విశాఖపట్టణం కేజీహెచ్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితులను ఇండ్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

LG polymers victims protest infront of KGH hospital in Visakhapatnam
Author
Visakhapatnam, First Published May 12, 2020, 4:21 PM IST

విశాఖపట్టణం: ఎల్జీ పాలీమర్స్ బాధితులు మంగళవారం నాడు విశాఖపట్టణం కేజీహెచ్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితులను ఇండ్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎల్జీ పాలీమర్స్ బాధితులను తరలించేందుకు తెచ్చిన నాలుగు బస్సులను  అధికారులు వెనక్కు పంపారు.

ఈ నెల 7వ  తేదీన ఎల్జీ పాలీమర్స ఫ్యాక్టరీ నుండి స్టైరిన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారంతా కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

also read:ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీకి అనుమతులు: వైసీపీ ఆరోపణలపై బాబు సవాల్ ఇదీ...

కోలుకొన్న వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అయితే తమకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కొందరు బాధితులు డిమాండ్ చేశారు. మరికొందరు తమకు రూ. 25 వేలు పరిహారం చెల్లించాలని కోరారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారంతా తమ ఇళ్లకు పోకుండా నిరసన వ్యక్తం చేశారు. దీంతో బాధితులను తరలించేందుకు ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చిన నాలుగు బస్సులను  వెనక్కు పంపారు.

బాధితులు కూడ తాము ఇళ్లకు వెళ్లబోమని చెప్పారు. ఈ విషయమై బాధితులకు నచ్చజెప్పిన తర్వాత వారిని ఇళ్లకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
మరో వైపు మంత్రులు సోమవారం నాడు రాత్రి బాధిత గ్రామాల్లో బస చేశారు. బాధిత గ్రామాల ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఈ ప్రయత్నం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios