Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) రివర్ గ్రాబింగ్ అమరావతి స్టైల్

ఉన్న భూములన్నీ ప్రభుత్వం సేకరించడమో, సమీకరించడమోచేస్తున్నది . కాజేసేందుకు భూముల్లేవు. మిగిలింది, కృష్ణా నదినే. రాజకీయ పెద్దలు, రియల్ రౌడీలు ఈ సరికొత్త కబ్జా ‘కృష్ణా  కబ్జా’  మొదలు పెట్టారు. ఇనప గోలుసులతో  నది గర్భంలో  సరిహద్దులు వేసుకున్నారు. తుమ్మల పాలెం, గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం మధ్యలో కృష్ణానది గర్భంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణం మేర ‘పెద్దలు’ ప్లాట్లు వేసుకున్నారు.

land grabbers occupy river Krishna near Amaravati  fishers protest

నదిని మాయం చేసే ప్రయత్నం.

 

బహుశా ఇదెక్కడ జరిగుండదేమో...

 

చెరువులను కాజేయడం చూశాం.శ్మశానాలను కాజేయడం చూశాం. హైదరాబాదలో మురికికూపంలాంటి మూసీని, అటు ఇటు కభలించి ముందు గుడిసెలు తర్వాత బంగాళాలు,ఫంక్షన్ హళ్లు వేసుకున్న వైనం చూశాం.కానీ నిండుగా నీరుండే ఒక నది మధ్యలో ‘ఇది మాది అని జెండాకర్రలు పాతడం’ చూశామా?

 

ఇలాంటిది జరిగినా ఎక్కడో, ఏదో మారు మూల, జనసంచారం లేని చోట, లోయల్లో, అడవుల్లో జరిగితే సరి. కాని ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో జరిగితే! అక్కడి కృష్ణానదిలో జెండాలు పాతి నది గర్భాన్ని కాజేసి,మాయం చేసే కుట్ర జరిగింది. ఇలా నదిలో జండాలు పాతారంటే, వారికి ఎంత ధౌర్యముండాలి. ఎంత మద్దతు వుండాలి.

 

అయితే,  ఈ విషయం వెల్లడయినా, ‘ఏదో ఉబలాట పడ్డారు. జండాలు పాతుకున్నారు, దానికి ఇంత రాద్ధాంతమా’ అన్నట్లు ప్రభుత్వం మౌనంగా ఉంటే,  నదిని కాజేసే ప్రయత్నం పై మత్స్యకారులు నిప్పులు చెరిగారు. నదిలో కాలుపెడితే తాట తీస్తామని హెచ్చరించారు.

 

ఇలా గర్జించేందుకు కారణం, రేపు ఈ నదిని మట్టితో పూడ్చేసి ఏదో ఒక  పార్టీ నాయకుడు పార్టీ కార్యాలయమో, ఆలయమో కడితే, కడుపు కాలేదీ వీరికే.అందుకే  ఆదివారం నాడు 250 బోట్లలో  నది అంతా నిరసన యాత్రలు చేశారు.మూడు గంటల పాటు వినూత్న రీతి ఈ నది మధ్య నే  మహాధర్నా చేపట్టారు.

 

ఉన్న భూములన్నీ ప్రభుత్వం సేకరించడమో సమీకరించడమోచేస్తున్నది . కాజేసేందుకు మిగిలింది, కృష్ణా నదినే. అందుకే  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ పెద్దలు, రియల్ రౌడీలు ఈ సరికొత్త కబ్జా ‘కృష్ణా  కబ్జా’  మొదలు పెట్టారు. ఇనప గోలుసులతో  నదిలో సరిహద్దులు వేసుకున్నారు.తుమ్మల పాలెం, గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం మధ్యలో కృష్ణానది గర్భంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణం మేర ‘పెద్దలు’ ప్లాట్లు వేసుకున్నారు. ఇది మాది అని ప్రటించుకుంటూ వాటి మీద డబ్బాలు, జెండాలెగరేశారు.. అసలు ఇలాంటి చర్య నదిలో ,అందునా రాజధాని పక్కనే ఎలా సాధ్యం?

 

దీనికి నిరసగానే తు గుంటుపల్లి, తాళ్లాయపాలెం, ఉద్దండ్రా యునిపాలెం లకు చెందిన  500 మందికిపైగా మత్స్యకారులు 250 బోట్లలో నదిలో కలియదిరిగి ‘కృష్ణా నదిని కబ్జారాయుళ్ల నుంచి కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు.   ఏమవుతుందోచూద్దాం. నది రియల్టర్లకు  లొంగి పోతుందా లేక మత్స్య కారులతో ఉండిపోతుందా?

Follow Us:
Download App:
  • android
  • ios