ఏపీలో కరోనా రాజధానిగా కర్నూలు: ఏ మాత్రం తగ్గని కేసుల సంఖ్య... కారణం ఏంటి..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో  కర్నూలు జిల్లా హాట్ స్పాట్‌గా మారింది. ఏపీలోనే జిల్లా మొత్తం రెడో జోన్ పరిధిలో ఉన్న జిల్లా కూడా ఇదే

Kurnool emerges as AP's coronavirus hotspot

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో  కర్నూలు జిల్లా హాట్ స్పాట్‌గా మారింది. ఏపీలోనే జిల్లా మొత్తం రెడో జోన్ పరిధిలో ఉన్న జిల్లా కూడా ఇదే. కర్నూలులో ఇంతగా కరోనా విలయతాండవం చేయడానికి కారణం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి.

ప్రైవేట్ ఆసుపత్రులు ఓపీలు చూడకూడదనే ఆదేశాలను పక్కనబెట్టి తబ్లిగికి వెళ్లొచ్చిన వారితో పాటు వారిని కాంటాక్ట్ అయిన వారికి కూడా వైద్యం అందించారు. దీంతో ఆ వైద్యుడికి కరోనా సోకింది.

తక్కువ మొత్తంలో ఫీజు తీసుకోకపోవడం, అసలు ఫీజు ఇవ్వకపోయినా పట్టించుకోరనే పేరుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు తెలంగాణ నుంచి కూడా రోగులు ఇతని వద్దకు  వస్తుంటారు. అదే ఆయనకు, ఆయన వైద్యం కోసం వచ్చిన వారికి శాపంగా మారింది.

Also Read:కరోనా టెస్టుల్లో వాయు వేగం: ఏపీ రికార్డు, 24 గంటల్లో లక్షదాటిన పరీక్షలు

తనకు ఆ మహమ్మారి కబలించింది అన్న సంగతి తెలుసుకునే లోపే పుణ్య కాలం గడిచిపోయింది.వైద్యుని తో పాటు అతని భార్య కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అతని కుటుంబంలో ని మరో ఆరు మందిని ఈ మహమ్మారి వదలలేదు.

దీంతో ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఉలిక్కిపడ్డారు. వైద్యుడు విధులు నిర్వహించిన కేఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారితో పాటు, అందులో పనిచేసే సిబ్బందిని వెతికి వెతికి వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది..

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ కారణమంటూ జిల్లాకు చెందిన మాజీ మంత్రి , టిడిపి నేత అఖిలప్రియ ఆరోపణలు చేశారు..తబ్లిగి జమాత్ కు వెళ్లి వచ్చిన వారిపై కర్నూల్ ఎమ్మెల్యే చూపించిన ఉదార ప్రేమ ఇంతటి విపత్తుకు కారణమైందని ఆమె మండిపడ్డారు.

ఆ రోజే అధికారుల  విధులకు అడ్డం పడకుండా ఉంటే తబ్లీగి వెళ్లొచ్చిన వారి కుటుంబసభ్యుల వరకే కరోనా చైన్ తెగిపోయి ఉండేదని అఖిల ప్రియ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని, అంతేకాకుండా కరోనాతో మృత్యువాత పడ్డ మృతదేహాలను జాతీయ రహదారి వద్ద ప్రజా నివాసాలకు సమీపంలో ఖననం చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు.

అయితే ఇదంతా కేవలం ప్రతిపక్షాల అనవసరపు రాద్ధాంతం అంటూ కొట్టిపారేశారు కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ప్రజా సమస్యలపై స్పందించాల్సిన వ్యక్తిగా బాధ్యతతో వ్యవహరించడం తప్పించి, ఎక్కడా ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని తేల్చిచెప్పారు.

Also Read:విశాఖలో తొలి కరోనా మరణం: క్వారంటైన్ కు వైద్య సిబ్బంది

మరోవైపు కర్నూలు జిల్లాలో వైరస్ నాలుగో దశ నడుస్తోందని అంటున్నారు అధికారులు. సోషల్ కాంటాక్ట్‌ కరోనా వైరస్ వైరల్ అవుతోందని, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందన్నారు.

కర్నూలు జిల్లా కు గతంలో కలెక్టర్ గా విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ జైన్  ను రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ స్పెషల్ ఆఫీసర్‌గా పంపించింది. తనితో పాటు మరో ఐఏఎస్ అధికారి హరినారాయణ, శ్రీనివాసులు తోపాటు భద్రత విషయంలో జిల్లా ఎస్పీకి అదనంగా మరో ఐపీఎస్ అధికారి దామోదర్‌ను నియమించింది.

వీరితో జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుమ్మనూరు జయరాం సమీక్ష సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios