కేటీఆర్ తో జరిపే చర్చలపై వైఎస్ జగన్ తన పార్టీ సీనియర్ నేతలతో హైదరాబాదులోని లోటస్ పాండులో భేటీ అయ్యారు. కేటీఆర్ తో చర్చించాల్సిన అంశాలను ఈ సమావేశంలో ఆయన క్రోడీకరించనున్నారు.
హైదరాబాద్: తమ భేటీకి ముందు ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరో వైపు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచన మేరకే ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలకు ఈ భేటీ జరుగుతోందని ఇరు పార్టీల నాయకులు కూడా చెప్పారు.
కేటీఆర్ తో జరిపే చర్చలపై వైఎస్ జగన్ తన పార్టీ సీనియర్ నేతలతో హైదరాబాదులోని లోటస్ పాండులో భేటీ అయ్యారు. కేటీఆర్ తో చర్చించాల్సిన అంశాలను ఈ సమావేశంలో ఆయన క్రోడీకరించనున్నారు. ప్రత్యేక హోదాకు సహకరిస్తే ఫెడరల్ ఫ్రంట్ కు సహకరిస్తామని జగన్ కేటీఆర్ తో చెప్పే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. కేటీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బృదం జగన్ నివాసం లోటస్ పాండ్ కు వెళ్లనుంది. కేసీఆర్ సూచనలు తీసుకుని వారు జగన్ వద్దకు బయలుదేరుతారని అంటున్నారు.
కేటీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బృందానికి జగన్ మధ్యాహ్నం విందు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు
కేటీఆర్, జగన్ భేటీ.. స్పందించిన విజయసాయిరెడ్డి
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్: నేరుగా కేసీఆర్ రంగంలోకి...
జగన్ తో కేటీఆర్ భేటీ నేడే: మతలబు ఇదే...
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ, 3 నెలలే: తలసాని
