తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో వైసీపీ అధినేత జగన్ ఈ రోజు భేటీ కానున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో వైసీపీ అధినేత జగన్ ఈ రోజు భేటీ కానున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ భేటీపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీతో చర్చించేందుకు కేటీఆర్‌ సిద్ధమయ్యారని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. 

ఇదే విషయాన్ని కేటీఆర్‌ కుడా తెలిపారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకే తమ పార్టీ నాయకులతో కలిసి వైఎస్‌ జగన్‌తో భేటీ అవుతున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశం జరగనుందని తెలిపారు. కాగా బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెరడల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

Scroll to load tweet…