Asianet News TeluguAsianet News Telugu

కొడాలి నానిపై కేసుకి ఎస్ఈసీ ఆదేశాలు: న్యాయ సలహాకి పంపిన కృష్ణా జిల్లా పోలీసులు

ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై కృష్ణా జిల్లా పోలీసులు న్యాయ సలహా తీసుకోనున్నారు.

krishna district police sent legal expert opinion to file case on minister Kodali nani lns
Author
Vijayawada, First Published Feb 14, 2021, 2:35 PM IST


విజయవాడ:ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలపై కృష్ణా జిల్లా పోలీసులు న్యాయ సలహా తీసుకోనున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘంపై శుక్రవారం నాడు మంత్రి కొడాలి  చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఈ వ్యాఖ్యలపై మంత్రి వివరణ ఇచ్చారు.తాను ఉద్దేశ్యపూర్వకంగా ఎస్ఈసీని కించపర్చలేదన్నారు. ఎస్ఈసీ అంటే తనకు గౌరవమని మంత్రి ప్రకటించారు. తనకు పంపిన షోకాజ్ ను ఉపసంహరించుకోవాలని కూడా కోరారు. అయితే ఈ వివరణపై సంతృప్తి చెందని ఎస్ఈసీ మంత్రిపై కేసు పెట్టాలని కృష్ణా జిల్లా పోలీసులను ఆదేశించింది. 

also read:ఎస్ఈసీ అర్థం చేసుకోలేదు: షోకాజ్‌కి మంత్రి కొడాలి సమాధానం

ఎస్ఈసీ ఆదేశాలు అందలేదని శనివారం నాడు పోలీసులు ప్రకటించారు. ఎస్ఈసీ ఆదేశాలు  ఆదివారం నాడు అందాయి. ఈ ఆదేశాలపై కృష్ణా జిల్లా పోలీసులు న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఈ ఆదేశాలను న్యాయ సలహాకు పంపారు.న్యాయ నిపుణుల సలహా తర్వాత కేసు విషయమై కృష్ణా జిల్లా పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios