రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శుక్రవారం నాడు లేఖ రాశారు. 


అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శుక్రవారం నాడు లేఖ రాశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఎస్ఈసీని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారనే నెపంతో మంత్రి కొడాలి నానికి ఇవాళ ఉదయం ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు పంపింది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపుగా ఈ షోకాజ్ కు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

also read:కొడాలికి షాక్: షోకాజ్ నోటీసిలిచ్చిన ఎస్ఈసీ

ఈ షోకాజ్ నోటీసులపై మంత్రి నాని స్పందించారు. షోకాజ్ నోటీసులు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఎస్ఈసీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. తన మాటల్లో నిజమైన భావాలను ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదన్నారు. ఎస్ఈసీని కించపర్చే వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎస్ఈసీని అవమానపర్చేలా తాను వ్యాఖ్యలు చేయలేదన్నారు.

తొలి విడత జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతున్న సమయంలో తాను వ్యాఖ్యలు చేశానని ఆయన తెలిపారు. తనపై జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని నాని ఆ లేఖలో కోరారు.