Asianet News TeluguAsianet News Telugu

ఆయేషా హత్య కేసు.. నార్కోటిక్ టెస్ట్‌కు సిద్ధం, కానీ అప్పుడే: కోనేరు సతీశ్

పోలీసులు చేసిన అన్ని టెస్టుల్లోనూ తాను నిర్దోషిగా తేలానన్నారు ఆయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీశ్. ఆయేషామీరా తల్లి తనకు బహిరంగ క్షమాపణ చెబితే తాను నార్కోటిక్ పరీక్షకు సిద్ధమని కోనేర్ సతీశ్ ప్రకటించారు.

koneru satish comments on ayesha meera case
Author
Vijayawada, First Published Jan 19, 2019, 8:27 AM IST

పోలీసులు చేసిన అన్ని టెస్టుల్లోనూ తాను నిర్దోషిగా తేలానన్నారు ఆయేషా మీరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీశ్. ఆయేషామీరా తల్లి తనకు బహిరంగ క్షమాపణ చెబితే తాను నార్కోటిక్ పరీక్షకు సిద్ధమని కోనేర్ సతీశ్ ప్రకటించారు.

సీబీఐ అధికారులకు అన్ని రకాలుగా సహకరిస్తానని ఆయన తెలిపారు. తన ఇళ్లంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి హార్డ్‌ డిస్క్, రెండు వీసీడీలు, ఒక సీడీ, రెండు టెలిఫోన్ డైరీలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఆయేషా మీరా హత్య జరిగిన భవనం కోనేరు కుటుంబానికి సంబంధించినదని.. మేమే దాని నిర్వహణ చూసుకునేవాళ్లమని... తాతగారు కోనేరు రంగారావు మంత్రిగా ఉండటంతో ఆయనపై బురద జల్లడానికి తనను ఉపయోగించుకున్నారని సతీశ్ ఆరోపించారు.

ఆయేషా మీరా హత్య జరిగినప్పుడు తాను ఇబ్రహీంపట్నంలో లేనని హైదరాబాద్‌లో ఉన్నానన్నారు. అందుకు సంబంధించిన టికెట్లను పోలీసులకు అందజేశానని వారు ఎయిర్‌లైన్స్‌లోనూ విచారణ చేశారని వెల్లడించారు.  

2007 నుంచి 2019 వరకు తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించారని మానసిక క్షోభతో తాతగారు, నానమ్మ,  మా అమ్మ చనిపోయారని సతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏనాటికైనా తాను నిర్దోషిగా తేలుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఇవాళ కోనేరు సతీశ్ బ్యాంక్ లాకర్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.  

ఆయేషా మీరా హత్య కేసు.. మిమిక్రీతో నన్ను హంతకుడిని చేశారు: సత్యంబాబు

ఆయేషా మీరా కేసులో దారుణమైన ట్విస్ట్

అయేషా మీరా హత్య కేసు: సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ

ఆయేషా మీరా కేసుపై సత్యంబాబు: అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios