ఆయేషా మీరా కేసుపై సత్యంబాబు: అమ్మను, చెల్లిని చంపేస్తామన్నారు
నా తల్లిని, చెల్లిని చంపేస్తామని బెదిరించి ఆయేషా మీరా హత్య కేసులో నన్ను ఇరికించారని సత్యంబాబు చెప్పారు.
విజయవాడ: నా తల్లిని, చెల్లిని చంపేస్తామని బెదిరించి ఆయేషా మీరా హత్య కేసులో నన్ను ఇరికించారని సత్యంబాబు చెప్పారు.
ఆయేషా మీరా హత్య కేసులో గతంలో శిక్షను అనుభవించిన సత్యంబాబును శుక్రవారం నాడు సీబీఐ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఈ విచారణ సమయంలో సత్యం బాబు కొన్ని కీలకమైన అంశాలను వెల్లడించినట్టు సమాచారం.
ఆయేషా మీరా హత్య జరిగిన సమయంలో అప్పట్లో విచారణ చేసిన పోలీసులు తనను ఈ కేసులో ఇరికించారని సత్యం బాబు చెప్పారు. నా తల్లిని, చెల్లిని చంపేస్తామని బెదిరించారన్నారు. అంతేకాదు తనను కూడ ఎన్‌కౌంటర్ చేస్తామని కూడ భయపెట్టారని సత్యంబాబు చెప్పారు.
కొంతమంది పోలీసు అధికారులు ప్రమోషన్ల కోసం కక్కుర్తిపడి తనను ఈ కేసులో ఇరికించారని సత్యంబాబు ఆరోపించారు. కొంతమంది పోలీసులు ప్రమోషన్ల కోసం కక్కుర్తిపడి తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు.
సత్యంబాబును ఈ కేసులో మరోసారి ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ అధికారులు సత్యం బాబును విచారిస్తున్న విషయం తెలుసుకొన్న గ్రామస్థులు ఆయన ఇంటికి భారీగా చేరుకొన్నారు.
సంబంధిత వార్తలు
ఆయేషా మీరా కేసు: కోనేరు మనవడిని విచారిస్తున్న సీబీఐ
ఆయేషా మీరా హత్య కేసు.. మిమిక్రీతో నన్ను హంతకుడిని చేశారు: సత్యంబాబు
ఆయేషా మీరా కేసులో దారుణమైన ట్విస్ట్
అయేషా మీరా హత్య కేసు: సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ