దుర్గమ్మ చీరె మాయం: ట్రస్ట్ బోర్డు పదవి నుండి కోడెల సూర్యలత ఔట్

Kodela suryalatha removed from vijayawada kanakadurga temple trust board
Highlights

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారికి సమర్పించిన  చీర మాయమైన ఘటనపై  పాలకవర్గసభ్యురాలు  కోడెల సూర్యలతను పాలకవర్గం నుండి తప్పించారు.
 

విజయవాడ:విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారికి సమర్పించిన  చీర మాయమైన ఘటనపై  పాలకవర్గసభ్యురాలు  కోడెల సూర్యలతను పాలకవర్గం నుండి తప్పించారు.

ఈ నెల ఐదవ తేదీన  దుర్గమ్మకు  ఉండవల్లికి చెందిన  భక్తులు  సుమారు రూ18వేల విలువైన చీరను బహుకరించారు.ఈ చీరను ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో నేయించారు. అమ్మవారిని చీరెను సమర్పించి కౌంటర్‌లో రశీదు తీసుకొని వచ్చే వరకు చీర మాయమైంది. 

ఈ చీరె మాయమైన ఘటనకు సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనకు సంబంధించి ఆ సమయంలో అక్కడ ఉన్న అర్చకులు, సిబ్బంది, భక్తులను విచారించిన  దేవాలయా ఈవో  పోలీసులకు ఓ నివేదికను అందించారు. పాలకమండలి సభ్యురాలు  కోడెల సూర్యలత ఈ చీరెను మాయం చేశారని  పోలీసులకు నివేదిక ఇచ్చారు.

ఈ నివేదిక ఆధారంగా పాలకవర్గం నుండి  కోడెల సూర్యలతను తప్పించారు. విచారణ పూర్తయ్యే వరకు  పాలకవర్గం నుండి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అమ్మవారికి సమర్పించిన చీరె మాయమైన ఘటన విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెల సూర్యలత కూడ  విచారణ జరిపించాలని పాలకవర్గం ఛైర్మెన్ కు, ఈవోకు లేఖ రాశారు. 

ఈ చీరె మాయమైన ఘటనకు సంబంధించి తన తప్పు లేదని ఆమె చెప్పారు. ఈ చీరె మాయమైన ఘటనకు సంబంధించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఈ వార్త చదవండి:దుర్గమ్మ గుడిలో అపచారం.. అమ్మవారి చీర మాయం

 

 

loader