విశాఖపట్నంలో రమేశ్ కృష్ణ అనే కేరళకు చెందిన వైద్య విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రేమ వ్యవహారంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని తేల్చారు. 

విశాఖపట్నంలో రమేశ్ కృష్ణ అనే కేరళకు చెందిన వైద్య విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. విశాఖలోని దాబా గార్డెన్స్‌లో ఓ లాడ్జిలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో ఓడిపోయానని తన చావుకు కారణం ఎవ్వరూ కాదని ఆమె సూసైడ్ నోట్‌లో రాసింది. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ప్రేమ వ్యవహారంతోనే రమేశ్ కృష్ణ ఆత్మహత్య చేసుకుందని తేలింది. 

మృతురాలు చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. అంతకుముందే ఇండోర్ లో వున్న ప్రియుడిని కలసింది. చైనాకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆమె ఈ నెల 23న విశాఖ వచ్చింది. ఈ క్రమంలో విశాఖ నుంచి సింగపూర్‌కు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కింది. ఈ క్రమంలోనే ప్రియుడితో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కీలకమైన వాట్సాప్ చాట్ పోలీసులు సంపాదించారు. ప్రియుడితో గొడవ కారణంగానే రమేశ్ కృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.