ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడెవరు? ప్రస్తుతం కళావెంకటరావు అధ్యక్షుడిగాకొనసాగుతున్నారు. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన తూర్పు కాపు నాయకుడు.  ఇపుడు కీలకమయిన విద్యుత్ శాఖ మంత్రిగా ఉంటున్నారు.  మంత్రి అయిన తర్వాత ‘జోడు పదవులు ఎవరికీ వద్దు’ అనే సిద్ధాంతం  ప్రకారం అయనను తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని అనుకున్నారు. అయితే అది జరగడం లేదు. ఇపుడు అందుతున్న సమాచారం ప్రకారం, ఆయనను తొలగించకపోవచ్చని, 2019 ఎన్నికలయ్యేదాకా ఆయనే  కొనసాగుతారని చెబుతున్నారు.

ప్రజారాజ్యం పార్టీ లోకి వెళ్లి వచ్చినా, కళావెంకటరావు కళ తగ్గకపోవడం విశేషం. దీనికి కారణం ఆయన తూర్పు కాపుల్లో బలమయన నాయకుడు. సౌమ్యుడు. వివాదాలెరుగని వాడు. ఆయన వల్ల  పార్టీకెపుడూ చిక్కలు రాలేదు.  మొన్న నంద్యాల ఎన్నికల్లో కూడా కోఆర్డినేషన్ బాగా చేశాడనే పేరువ్చింది. వీటన్నింటికంటే ముఖ్యంగా  తెలుగుదేశం పార్టీ బిసిల పార్టీ అని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి అవకాశం. ఈ కారణాలతో కళా వెంకటరావునే  వచ్చే ఎన్నికలయిపోయే దాకా టిడిపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కొనసాగుతాడని చాలా మంది ధీమాగా చెబుతున్నారు.

అయితే, ఇక్కడొక సమస్య వస్తావుంది. కాపు నాయకుడు, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల రాజప్ప కూడా ఈ పదవిమీద కన్నేశారట. కాపులకి బిసి స్టేటస్ఇవ్వడం లేదు, రిజర్వేషన్లు రావడంలేదు, అందువల్ల రాజప్ప ను అధ్యక్షడిని చేస్తే  అసలు టిడిపి పార్టీయే కాపులది అని చెప్పుకునేందుకు వీలువుతుందని వాదించే వర్గం తయారయింది. రాజప్పను పార్టీ అధ్యక్షుడిని చేయడం వల్ల మరి కొంతమంది కాపులను శాంతింప చేయవచ్చని కూడాచెబుతున్నారు.  ఇక్కడ రాజప్ప పార్టీకి చేసిన సేవలను ఉదహరిస్తున్నారు. ముద్రగడను ఫినిష్ చేసింది రాజప్పేనని, రాజప్ప వేసిన ప్రశ్నలకు ముద్రగడ సమాధానం చెప్పలేకపోతున్నారని, కాపుల్లోని ఒక వర్గం అసలు బిసి కోటాయే మాకువద్దని కూడా  వాదిసున్నదంటే అదంతా రాజప్ప ట్రయినింగేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో కన్విన్స్ అయ్యారని,

అందువల్లే కళా వెంకటరావు పేరు ప్రకటించడంలో జాప్యానికి కారణం, కాపు నాయకుడిని అధ్యక్షుడిని చేసినందువల్ల రాజకీయ ప్రయోజనం ఎక్కువని బాబు కు కూడా తెలుసని వారు అంటున్నారు. కాపు అనేమాట మళ్లీ రాజకీయ నినాదం కాకుండా ఉండాలంటే, ఇద్దరు రాజకీయ రంగంమీదకనిపించరాదు. ఒకరు ముద్రగడ, రెండు పవన్ కళ్యాణ్. రాజప్ప వీరిద్దరిని కూడా మసక బరచగల సమర్థుడని బాబుకు తెలుసని అంటూ రాజప్పను ఇగ్నోర్ చేయడం సాధ్యంకాదని ఈ వర్గం చెబుతున్నది.  రాజప్పకు మరొక కీలకమయిన పార్టీ బాధ్యత ను  గుర్తించాకే కళా వెంకటరావు పేరు ప్రకటిస్తారని తెలిసింది. దసరా తర్వాత ఇది జరగవచ్చని కూడా చెబుతున్నారు.