Asianet News TeluguAsianet News Telugu

రంగా విగ్రహం కూల్చేశారు

28 సంవత్సరాల కిందట హత్యకు గురయిన వంగవీటి రంగా మీద రామ్ గోపాల్ వర్మ తనదయిన శైలిలో  సినిమా తీసి కుల నిప్పు మీద ఉన్న నివురును వూదేశారు. 

Kapu leader Ranga statue demolished in Vijayawada

విజయవాడలో చెలరేగుతున్న కాపు వివాదాన్నికొత్త మలుపు తిప్పుతూ  నాటి కాపు నేత  వంగవీటి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు.  

 

కుల రాజకీయాల కేంద్రమయిన విజయవాడలో ఇలా  వంగవీటి రంగవిగ్రహం కూల్చడాన్ని కాపులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 

 

అదివారం పొద్దనే రంగా విగ్రహం దిమ్మె మీద లేక పోవడం చూసిన ఆయన అభిమానులు అవాక్కయ్యారు. వెదికి తే, తల విరిగి దిమ్మెదగ్గిర పడి ఉండటం కనిపించింది.అంతే, అ ప్రాంతంలో భూమికంపించింది. చాలా కాలంగా ఈ ప్రాంతంలో కాపు-కమ్మ రాజకీయ నాయకులు మధ్య వైషమ్యాలున్నాయి. అవెపుడూ లోలోపలే ఉంటూ వస్తున్నాయి. కాకపోతే,ఓటు రూపం తీసుకుంటూవచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కుల రాజకీయాలు కొంత బలపడ్డట్టు స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నరాష్ట్రంగా కుదించుకుపోయిన ఆంధ్రలోప్రాంతాలు,  కొన్నికులాలు ఇపుడు అధికారంలో  భాగస్వామ్యం కోరుతున్నాయి. ఒక వర్గం కాపులు రిజర్వేషన్ల పేరుతో ఉద్యమంలో ఉన్నారు. మరొక వర్గం తెలుగుదేశం పార్టీలో బాగా సర్దుబాటయి పదవులు కొట్టేశారు.కొంతమంది పవన్ కోసం ఎదురుచూస్తున్నారు.మరొ కొందరు కాంగ్రెస్ నేత  చిరంజీవి వైపు చూస్తున్నారు. 

 

ఇలాంటపుడు 28 సంవత్సరాల కిందట హత్యకు గురయిన వంగవీటి రంగా మీద రామ్ గోపాల్ వర్మ తనదయిన శైలిలో  సినిమా తీసి కుల నిప్పు మీద ఉన్న నివురును వూదేశారు.  దీనితో ఈప్రాంతంలో కులరాజకీయాలు మళ్లీ సలసలమనడం మొదలయింది.  ఇపుడు రంగా విగ్రహం ధ్వంసం దీని పర్యవసానమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు.

 

 

ప్రభుత్వం తమతోనే ఉంటుందని రంగా ప్రత్యర్థి వర్గం  భావిస్తోంచి ఈ పనికి పూనుకుందా?

 

విగ్రహం కూల్చిన వార్త వెలువడగానే  సింగ్‌ నగర్‌లో  ఉద్రిక‍్త వాతావరణం నెలకొంది.

 

రంగా అభిమానులు పెద‍్దఎత్తున అక్కడకు చేరుకుని ధర్నా కూర్చున్నారు. రంగా విగ్రహాన్ని ధ‍్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, రంగా విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష‍్టించాలని వారు డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక‍్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళవకారులకు నచ‍్చచెప్పారు.

 

విగ్రహాన్ని కూల్చిన దుండగులను కనిపెట‍్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది నాయకులు తీవ్ర విమర్శలకు కూడా దిగారు. ముఖ్యమంత్రి పేరును కూడా లాగి ఆయన అండతోనే ఈ దుశ్చర్యకు దుండగులు పూనుకున్నారని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios