సినీనటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. మంచి భవిష్యత్తు వున్న నటుడిని కోల్పోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

సినీనటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆదివారం గుంటూరులో తన శ్రేయోభిలాషులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు కన్నా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తారకరత్న మృతి బాధ కలిగించిందన్నారు. మంచి భవిష్యత్తు వున్న నటుడిని కోల్పోవడం బాధాకరమన్న లక్ష్మీనారాయణ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

ALso REad: తారకరత్న ఎప్పుడో చనిపోయారు.. కొడుకు కోసం చంద్రబాబు, ఆసుపత్రిలో ఇన్నాళ్లు అందుకే : లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు

ఇకపోతే.. కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న టీడీపీలో చేరనున్నారు. గురువారం ఆయన బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన ముఖ్య అనుచరులు, శ్రేయాభిలాషులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. అయితే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన అనుచరులతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయానికి ప్రకటించనున్నట్టుగా తెలిపారు. 

రాష్ట్ర పార్టీ పనితీరు నచ్చకనే రాజీనామా.. 
బీజేపీకి రాజీనామా చేసిన సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు గౌరవం ఉందని.. అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పారు. బీజేపీలో చేరినప్పటికీ నుంచి పార్టీ అభివృద్ది కోసం కృషి చేశానని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరిని ఏకతాటిపై నడిపానని తెలిపారు. సోమువీర్రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక పరిస్థితి అంతా మారిపోయిందని విమర్శించారు. సోమువీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదన్నారు. సోమువీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పార్టీలో చర్చించి అభిప్రాయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆయన వైఖరి, వ్యవహారశైలి నచ్చకనే పార్టీని వీడుతున్నట్టుగా చెప్పారు. తన పాటు రాజీనామా చేసిన అనుచరులకు ధన్యవాదాలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Also REad: టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ :ఈ నెల 23న బాబు సమక్షంలో చేరిక

కాగా.. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న తారకరత్న చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురయ్యింది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

రీసెంట్ గా నారా లోకేష్ నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు.విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది