సినీనటుడు నందమూరి తారకరత్న మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. తారకరత్న ఎప్పుడో చనిపోయారని.. కొడుకు పాదయాత్ర కోసం ఇన్నాళ్లు చంద్రబాబే ఆ నిజం దాచారని ఆమె ఆరోపించారు. 

సినీనటుడు నందమూరి తారకరత్న మరణం సినీ, రాజకీయ వర్గాలను విషాదంలోకి నెట్టింది. ఎంతో భవిష్యత్ వున్న ఆయన చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్నను చివరి చూపు చూసుకునేందుకు పలువురు సెలబ్రెటీలు ఆయన నివాసానికి ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తారకరత్న మృతి చాలా బాధాకరమైన విషయమన్నారు. చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు. లోకేష్ పాదయాత్రకు, లోకేష్‌కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్త చంద్రబాబు ఇన్నాళ్లు దాచాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయ కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పుడైనా ఆయన మరణవార్తను ప్రకటించి ఉండాలి కదా అని ఆమె దుయ్యబట్టారు. 

ALso REad: టీడీపీ బద్దశత్రువు విజయసాయిరెడ్డి తారకరత్నకు మామ ఎలా అయ్యాడు? భార్య అలేఖ్య షాకింగ్ డిటైల్స్!

ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేసారని.. రాష్ట్రానికే తండ్రీకొడుకులు అపశకునమని ప్రజలకు తెలుసునని లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండె ఆగిపోయిన నాడే తారకరత్న బ్రతకడం చాల కష్టమని వైద్యులు చెప్పారని ఆమె గుర్తుచేశారు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. నారా కుటుంబం నీచమైన రాజకీయాలు చేయడం ఆపేస్తే, తమ నందమూరి కుటుంబం బాగుపడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. 

వీడియో

కాగా.. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న తారకరత్న చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి గురయ్యింది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ALso Read: తారకరత్న దెబ్బకు ఇండస్ట్రీ నివ్వెరపోయింది.. ఉప్పెనలా 9 చిత్రాలతో రికార్డ్, అప్పట్లో ఏం జరిగిందంటే

రీసెంట్ గా నారా లోకేష్ నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు.విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది.