మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ బుధవారం తెల్లవారు జామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

గుంటూరు: మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ బుధవారం తెల్లవారు జామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీ రావడంతో ఆయనను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

ఆయనకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మంగళవారంనాడు ఆయన బిజెపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది.

ఇదిలావుంటే, కన్నా లక్ష్మినారాయణ అనుచరులు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాంగ్రెసు బ్లాక్ కమిటీ చైర్మన్ కర్ణా సైదారావు, ఆయన అనుచరులు జగన్ సమక్షంలో వైసిపిలో చేరనున్నారు.

సైదారావు చేరికతో గుంటూరు జిల్లా కారంపూడి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవుతుందని వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు