ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మరోసారి మండిపడ్డారు. ఈ రోజు విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ఓ అంగతకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కన్నా  స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై దాడి జరిగిందని కన్నా ఆరోపించారు. తిరుపతిలో అమిత్‌ షా వాహనంపై దాడి, రాష్ట్ర పర్యటనలో తనపై దాడి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై దాడికి పెద్ద కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.

వీటిని పరిశీలించి చూస్తే ఏపీలో ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు ఏస్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందని పేర్కొన్నారు. ఏపీలో శాంతి భద్రతలు దారుణమైన స్థితిలో ఉన్నాయని అనడానికి ఈ దాడే నిదర్శమన్నారు. జగన్‌పై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వమే ఈ దాడులకు బాధ్యత వహించాలని అన్నారు.

 

read more news

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)