Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మంగారు అలా అన్నది జగన్ బ్యాచ్ గురించే...: కళా వెంకట్రావు సెటైర్లు

భవిష్యత్ లో దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మం గారు చెప్తే ఎవరి గురించో అనుకున్నారు... కానీ ఆయన చెప్పింది జగన్, వైసీపీ నేతల గురించేనని ప్రజలకు ఇప్పుడు అర్ధమైందని మాజీ మంత్రి, టిడిపి ఏపి అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. 

Kala Venkat Rao Satires on AP CM Jagan and YSRCP Leader
Author
Amaravathi, First Published Jun 3, 2020, 12:00 PM IST

అమరావతి: భవిష్యత్ లో దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మం గారు చెప్తే ఎవరి గురించో అనుకున్నారు... కానీ ఆయన చెప్పింది జగన్, వైసీపీ నేతల గురించేనని  ప్రజలకు ఇప్పుడు అర్ధమైందని మాజీ మంత్రి, టిడిపి ఏపి అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి , మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని... నవరత్నాలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చి  రాష్ట్రంలోని సహజ వనరులన్నీ లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

''వైసిపి నాయకులు చివరికి ఇసుక, మట్టి కూడా అమ్ముకుంటున్నారు. ప్రజలకు నవరత్నాలు పంచుతామని వైసీపీ నేతలు పంచ భూతాలను పంచుకుతింటున్నారు. 
టీడీపీ హయాంలో ఉచితం గా ఇసుక ఇస్తే నేడు ఇసుక కావాలంటే వైసీపీ నేతలకు ప్రజలు  కమిషన్లు ఇవ్వాల్సి వస్తోంది. రీచ్ లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండా మధ్యలోనే మాయమవుతోందని వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే వైసీపీ నేతల ఇసుక దోపిడీ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది'' అన్నారు. 

''వైసీపీ పాలనలో ఇసుక కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక రూ 25నుంచి రూ30 వేల వరకు ధర పలకగా  నేడు లారీ ఇసుక రూ 60 వేలనుండి 70 వేల వరకు  వసూలు చేస్తున్నారు.పేదలు ఇసుక కొనలేక ఇళ్ళ నిర్మాణం మద్యలోనే ఆపేసి మొండి గోడల్లో తలదాచువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వచ్చినందుకు వైసీపీ నేతలు సిగ్గుపడాలి'' అని మండిపడ్డారు. 

read more   ''కరోనా విషయంలో ప్రపంచం, దేశం కంటే ఏపీయే మెరుగు...గణాంకాలివే''

''ఇసుక దోపిడికి అడ్డుకట్ట వేసి ఇసుక సామాన్యులకు పూర్తిగా అందుబాటులోకి రావడానికి ప్రభుత్వం దృష్టి సారించాలి. లేకపోతే  ఇసుక తుఫానులో  వైసీపీ  ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం'' అని హెచ్చరించారు. 

''దళితులు టీడీపీకి అండగా ఉన్నారన్న అక్కసుతో వైసీపీ ప్రభుత్వం దళితులపై కక్ష్య సాదింపు చర్యలకు పాల్పడుతోంది. మాస్కుల్లేవ‌ని అడిగిన ద‌ళిత డాక్టర్ సుధాక‌ర్‌ని ఉగ్రవాది కంటే ఘోరంగా హింసించి బంధించారు. పిచ్చివాడిగా ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్ లో చేర్చారు. కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‍పై ‍ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు'' అని ఆరోపించారు. 

''చివరకు ఆంధ్రా యూనివర్సిటీలో కుల వివక్షతో దళిత లెక్చరర్ ప్రేమానందంపై దాడి చేయడం హేయం. గ్రామాల్లో దళితుల భూములు వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. పలు చోట్ల భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దళితులపై వైసీపీ కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి'' అని ప్రభుత్వాన్ని సూచించారు కళా వెంకట్రావు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios