అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కరోనా వైరస్ నిర్ధారణకు సంబంధించిన పరీక్షలను విస్తృతం చేసింనట్లు కోవిడ్19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ 
వెల్లడించారు. ప్రస్తుతం రోజుకి 12 వేల మందికి పైగా పరీక్షలు చేస్తూ దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. నేటి వరకు 3200  మంది పాజిటివ్ వచ్చినప్పటికి జిల్లాల వారీగా మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తూ 2209 మంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేలా చేసి వారివారి గృహాలకు పంపటం జరిగిందన్నారు. 

దేశంలో రికవరీ రేటు 48 శాతం, ప్రపంచంలో 45 శాతం రికవరి రేటు వుంటూ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది 69 శాతంగా వుంది. ఇలా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే రాష్ట్రాలలో ముఖ్యమైనదిగా ఏపి నిలిచింది. ఇలా రాష్ట్రం నుండి కరోనాను తరిమికొట్టేందుకు నిరంతరం నిర్విరామంగా పని చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి పేరుపేరునా అభినందనిస్తున్నట్లు శ్రీకాంత్ వెల్లడించారు. 

read  more  నవాబుపేటలో 10 మందికి కరోనా: రోగుల తరలింపును చూస్తూ గుండె పగిలి మహిళ మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా వైరస్ వ్యాప్తిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 82 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3200కు చేరుకుంది. కోవిడ్ -19తో ఇప్పటి వరకు రాష్ట్రంలో 64 మంది మరణించారు. 

ఏపీలో గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్ ను పరీక్షించగా 82 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 40 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఏ విధమైన మరణాలు కూడా సంభవించలేదు. 

ఇప్పటి వరకు మొత్తం 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, 927 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 112 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. యాక్టివ్ కేసులు 111 ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 479 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వారిలో 282 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మిగతావారు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.