Asianet News TeluguAsianet News Telugu

వీడిన కాకినాడ మర్డర్ మిస్టరీ... తల్లిని చంపింది తండ్రేనని బయటపెట్టిన రెండున్నరేళ్ల చిన్నారి

భార్యపై అనుమానం పెనుభూతమై అతి దారుణంగా చంపి సాధారణంగా మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడో కసాయి భర్త. కాని అతడి రెండున్నరేళ్ల కూతురు తండ్రే తల్లిని చంపినట్లు బయటపెట్టింది. 

Kakinada Woman Murder mystery solved with arrest of his Husband
Author
First Published Sep 25, 2022, 8:50 AM IST

కాకినాడ : భార్యను అతి దారుణంగా గొంతునులిమి చంపి సాధారణ మరణంగా అందరినీ నమ్మించాడో కసాయి భర్త. అయితే ఈ దంపతుల రెండున్నరేళ్ల కూతురు తండ్రే తల్లిని చంపినట్లు బయటపెట్టింది. వచ్చీరాని మాటలతో... గొంతునులిమినట్లుగా సైగలతో తల్లిని తండ్రి ఎలాచంపాడో చిన్నారి తాతకు తెలపగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో భార్యను చంపిన కసాయి భర్త కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఒడిశాకు చెందిన మాణిక్ ఘోష్, లిపికా మండల్ భార్యాభర్తలు. వీరికి ఏడేళ్ల క్రితం వివాహమవగా రెండున్నరేళ్ల మహి సంతానం. ఉపాధి నిమిత్తం భార్యాభర్తలు ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడలో నివాసముండేవారు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న మాణిక్ ఆమెను మానసికంగానే కాకుండా శారీరకంగా వేధించేవాడు. 

భార్యాభర్తలిద్దరిలా కాకుండా కూతురు మహి కాస్త నల్లగా వుంటుంది. దీంతో భార్యపై మాణిక్ అనుమానం మరింత పెంచుకుని వేధింపులు ఎక్కువయ్యాయి. బిడ్డ రంగే కారణంగా అనుమానించే మూర్ఖుడితో కలిసుండలేక లిపికా పుట్టింటికి వెళ్లింది. అయితే అత్తామామలు ఆమెకు సర్దిచెప్పి మూడునెలల క్రితమే మళ్లీ కాకినాడకు తీసుకువచ్చారు. ఇంతజరిగినా మాణిక్ తీరులో ఏమాత్రం మార్పు లేదు... భార్యపై వేధింపులు ఆగలేదు. 

Read More  దారుణం.. ప్రైవేట్ ఆసుపత్రిలో 43 యేళ్ల మహిళపై.. 23 యేళ్ల వార్డ్ బాయ్ అత్యాచారం..

ఈ క్రమంలోనే ఈ నెల 18న రాత్రి లిపికాకు మూర్చ వచ్చిందంటూ భర్త మాణిక్ హాస్పిటల్ కు తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందింది. లిపికా మూర్చతో చనిపోయినట్లుగా కనిపించపోవడం, మెడపై నల్లగా కమిలినట్లు వుండటంతో అనుమానించిన డాక్టర్లు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా దహనసంస్కారాలు కానిచ్చారు. 

లిపిక అంతిమ కార్యక్రమాలన్నీ ముగియడంతో చిన్నారి మహిని అమ్మమ్మ వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చిన్నారి తల్లి ఎలా చనిపోయిందో తెలిసీ తెలియని మాటలతో తాతకు చెప్పింది. తండ్రి తల్లి గొంతునులిమి ఎలా చంపాడో తాతకు సైగలతో వివరించింది. దీంతో మృతురాలు లిపికా తండ్రి మనవరాలితో కలిసి తిరిగి కాకినాడకు వచ్చి చిన్నారి చెప్పిందంతా పోలీసులకు తెలిపాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు మాణిక్ ను అరెస్ట్ చేసారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios