పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసుల అనుమతి: జనసేన శ్రేణుల్లో జోష్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేవని కాకినాడ ఎస్పీ సతీష్ చెప్పారు.
కాకినాడ:ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేదని కాకినాడ ఎస్పీ సతీష్ చెప్పారు. జనసేన నేతలతో డీఎస్పీలు టచ్ లో ఉన్నారని కాకినాడ ఎస్పీ సతీష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్యటన వారాహి యాత్ర నేపథ్యంలో భద్రత కోసం మినిట్ మినిట్ షెడ్యూల్ అడిగినట్టుగా ఎస్పీ వివరించారు. ఎవరైనా ఎక్కడైనా పర్యటించే హక్కుందన్నారు. పవన్ కళ్యాణ్ యాత్రను రేపు తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయించాలని జనసేన నేతలు భావించారు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేవని కాకినాడ ఎస్పీ సతీష్ ప్రకటించడంతో జనసేన కార్యకర్తల్లో జోష్ వచ్చింది.
తొలుత తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. తొలుత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభించనున్నారు ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్.
ఈ రెండు జిల్లాల్లో యాత్ర ముగిసిన తర్వాత ఇతర జిల్లాల్లో పవన్ కళ్యాణ్ యాత్ర నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా వారాహి యాత్ర నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
also read:ఎల్లుండి నుండి పవన్ వారాహి యాత్ర: అనుమతికి కోర్టుకెళ్లే యోచనలో జనసేన
మరో వైపు తెలంగాణలో కూడ యాత్ర నిర్వహించాలని కూడ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. నిన్న తెలంగాణకు చెందిన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.. తెలంగాణలో కూడ వారాహి యాత్ర నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి యాత్ర ద్వాదరా జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానున్నాయి.
ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తులు ఉంటాయని ఈ రెండు పార్టీలు సంకేతాలు ఇచ్చాయి. ఈ విషయమై చంద్రబాబునాయుడు , పవన్ కళ్యాణ్ లు చర్చించిన విషయం తెలిసిందే.