ఎల్లుండి నుండి పవన్ వారాహి యాత్ర: అనుమతికి కోర్టుకెళ్లే యోచనలో జనసేన
పవన్ కళ్యాణ్ ఎల్లుండి నుండి ప్రారంభించే వారాహి యాత్రకు అనుమతివ్వకపోతే కోర్టును ఆశ్రయించాలని జనసేన భావిస్తుంది..
అమరావతి: ఈ నెల 14 నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి వారాహి యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ తలపెట్టారు. అయితే ఈ యాత్రకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోతే ఈ నెల 13న హైకోర్టును ఆశ్రయించాలని జనసేన భావిస్తుంది.
ఈ నెల 14 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ నుండి వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. అయితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీస్ యాక్ట్ ను అమల్లో ఉందని పోలీస్ శాఖ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని జనసేన నుండి సమాచారం వచ్చిందని పోలీస్ శాఖ పేర్కొంది. పవన్ కళ్యాణ్ టూర్ కు సంబంధించి మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం ఇవ్వాలని పోలీస్ శాఖ కోరుతుంది. మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం ఇచ్చామని జనసేన నేతలు చెబుతున్నారు.
also read:తెలంగాణకు వస్తా: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ప్లాన్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు చెందిన వారాహి యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను అందించిన కూడ సమాచారం ఇవ్వలేదని చెప్పడం సరైంది కాదని జనసేన నేతలు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి అనుమతికై హైకోర్టును ఆశ్రయించాలని జనసేన భావిస్తుంది. ఈ విషయమై ఈ నెల 13న జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. గతంలోనే ఈ యాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించాలి . కానీ కొన్ని కారణాలతో ఈ యాత్ర వాయిదా పడింది. అయితే ఈ నెల 14 నుండి వారాహి యాత్ర నుండి ప్రారంభించాలని షెడ్యూల్ కూ డ ప్రకటించారు. తొలుత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి యాత్రను ప్రారంభించారు.ఈ రెండు జిల్లాల్లో యాత్ర పూర్తైన తర్వాత ఇతర జిల్లాల్లో యాత్ర సాగనుంది.