నంద్యాల ఉపఎన్నికలో గెలిచేందుకు నానా అవస్తలు పడుతున్న టిడిపిపై హటాత్తుగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వటం ఊహించని షాకే. నంద్యాలతోనే వేగలేకపోతుంటే దానికి కాకినోడు తోడైతే టిడిపి పరిస్ధితి ఎలాగుంటుందో ఊహించుకోవటం కష్టమే. ఎందుకంటే, గడచిన ఏడాదిగా ముద్రగడ పద్మనాభం పుణ్యామ అని కాపు రిజర్వేషన్ డిమాండ్ తో తూర్పుగోదావరి ఉడికిపోతోంది. కాకినాడ తూర్పు గోదావరిలోనే కీలకమైన నగరం. ముద్రగడ సొంతూరు కిర్లంపూడికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
‘పెనంమీద నుండి పొయ్యిలోకి పడ్డాడు’ అనే సామెత గుర్తుకు వస్తోంది చంద్రబాబునాయుడు పరిస్ధితి చూస్తుంటే. అసలే నంద్యాల ఉపఎన్నికలో గెలిచేందుకు నానా అవస్తలు పడుతున్న టిడిపిపై హటాత్తుగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వటం ఊహించని షాకే. రెండు ఎన్నికల్లో దేనికదే ప్రత్యేకం. ఎలాగంటే, నంద్యాల ఎన్నిక ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణంతో అనివార్యమైన ఉపఎన్నిక. ఫిరాయింపులతో రాజీనామాలు చేయించి తెరిగి గెలుచుకోమని జగన్ సవాలు చేస్తున్నా చంద్రబాబు ఏమాత్రం స్పందించలేదు. గెలిచే నమ్మకమే ఉంటే ఎందుకు స్పందిచరు? అటువంటి పరిస్ధితిలోనే నాగిరెడ్డి మరణం, ఉపఎన్నిక అనివార్యమవటం చంద్రబాబును ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
ఉపఎన్నికలో గెలవటమన్నది టిడిపికి ఎంతటి ప్రతిష్టగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడచిన నెల రోజుల్లో చంద్రబాబు వైఖరి చూస్తేనే నంద్యాలను చంద్రబాబు ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్ధమైపోతుంది. అయితే, చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గెలుపుపై ఇంకా నమ్మకం కలగలేదంటేనే టిడిపి పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. అటువంటిది ఈ ఎన్నికలో గనుక టిడిపి ఓడిపోతే ఇంకేమన్నా ఉందా?
మొత్తం ప్రభుత్వమంతా నంద్యాల గెలుపుపైనే దృష్టి పెట్టిన విషయాన్ని అందరూ చూస్తున్నదే. ఇటువంటి సమయంలోనే ఉరుములేని పిడుగులాగ కాకినాడ షెడ్యూల్ వచ్చేసింది. దాంతో టిడిపి ఉలిక్కిపడింది. నంద్యాలతోనే వేగలేకపోతుంటే దానికి కాకినాడు తోడైతే టిడిపి పరిస్ధితి ఎలాగుంటుందో ఊహించుకోవటం కష్టమే. ఎందుకంటే, గడచిన ఏడాదిగా ముద్రగడ పద్మనాభం పుణ్యామ అని కాపు రిజర్వేషన్ డిమాండ్ తో తూర్పుగోదావరి ఉడికిపోతోంది. కాకినాడ తూర్పు గోదావరిలోనే కీలకమైన నగరం. ముద్రగడ సొంతూరు కిర్లంపూడికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
తూగోజిలోని కాపులంతా చంద్రబాబుపై ఏ స్ధాయిలో మండిపోతున్నారో కొత్తగా చెప్పకర్లేదు. ఎప్పుడో జరగాల్సిన ఎన్నికను ప్రభుత్వం మూడేళ్లుగా వాయిదా వేస్తోంది. గెలుస్తామన్న నమ్మకం లేకే ఎన్నికను వాయిదా వేయిస్తోందన్న విషయం తెలిసిందే. అయితే, కోర్టు జోక్యంతో ప్రభుత్వానికి ఇష్టంలేకపోయినా కాకినాడ ఎన్నిక జరపాల్సి రావటం నిజంగా చంద్రబాబుకు బాగా ఇబ్బందే. ఎందుకంటే, 2.30 లక్షల కాకినా కార్పొరేషన్లో కాపుల ఓట్లే చాలా కీలకం. ఈనెల 29న పోలింగ్. ఒకవైపు ముద్రగడ ఉద్యమాలు, ఇంకోవైపు ప్రభుత్వంపై కాపులు మండిపాటు, అదే సమయంలో పుంజుకున్న వైసీపీ. ఇన్ని సమస్యల మధ్య కార్పొరేషన్ ఎన్నికలను టిడిపి ఏ విధంగా ఎదుర్కొంటుందో అని అందరిలోనూ ఆశక్తి పెరిగిపోయింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
