రాజంపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో భూఅక్రమాలకు పాల్పడిన ప్రతిపక్ష టిడిపి నాయకుడొకరు అరెస్టయ్యారు. ఓ సొసైటీ ఆస్తులను ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్దంగా విక్రయించాడన్న ఆరోపణలపై సదరు టిడిపి నాయకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కడప జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి మరిప్రసాద్ ఇటీవల రాజంపేటలో అటాచ్ లో వున్న ఐదెకరాల భూమిని విక్రయించాడు. అయితే ఈ భూమి తమదని...దీన్ని హరిప్రసాద్ ఆక్రమించుకున్నాడని శ్రీసాయి ఎడ్యేకేషన్ సొసైటీ ఆరోపిస్తోంది. ఈ మేరకు సొసైటీ వ్యవస్థాపకులు వెంకటసుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిప్రసాద్ తో పాటు ఆయనకు సహకరించిన మూర్తి, శంకర్ నాయుడు, జోహర్ చౌదరీలను అరెస్ట్ చేశారు. 

read more   హైకోర్టు న్యాయమూర్తి ఇంటిపక్కనే వున్నా... రక్షనేది: దాడిపై పట్టాభిరాం (వీడియో)

వెంకటసుబ్బయ్య  నుండి ఫిర్యాదును అందుకున్న విచారణ నిమిత్తం హాజరుకావాలని పలుమార్లు హరిప్రసాద్ ను పిలిచినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడు విచారణకు హాజరుకాకుండా పరారీలో వుండసాగాడు. దీంతో అతడి కోసం గాలింపు చేపట్టి దేవుడి కడపలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని ప్రొద్దుటూరు సబ్ జైలుకు తరలించారు. 

చార్మినార్‌ బ్యాంకులో రుణం విషయంలో తనను అరెస్టు చేయడంతో సొసైటీ తాత్కాలిక సెక్రటరీగా హరిప్రసాద్‌ను నియమించినట్లు వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇదే అదనుగా రాజంపేటలో భూమిని నకిలీ పేర్లతో విక్రయించినట్లు అతడు ఆరోపించారు.