అమరావతి: శనివారం అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు  తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారుపై దాడికి పాల్పడ్డారు. రాత్రి ఇంటిబయట పార్క్ చేసిన కారు తెల్లవారేసరికి ధ్వంసమై వుంది. అన్నివైపులా వున్న అద్దాలతో పాటు కారు బాడీపైనా దాడి చేయడంతో పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ దాడిపై పట్టాభిరామ్ మాట్లాడుతూ... తన నివాసం పక్కన హైకోర్టు న్యాయమూర్తి నివాసం ఉందన్నారు. అక్కడ పోలీసు పికెట్ ఉన్నప్పటికీ కేవలం రెండడుగుల దూరంలో వున్న కారు ధ్వంసమవడం విచిత్రంగా వుందన్నారు. కారును ధ్వంసం చేసినంత మాత్రాన తాను భయపడే ప్రసక్తి లేదని పట్టాభిరామ్ అన్నారు.  

వీడియో

"