హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న45 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఓ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం తాను రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున పర్యటిస్తున్నాని తెలిపారు. 

సుమారు 50వేల మంది ఓటర్లతో ప్రతి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నానని స్పష్టం చేశారు. తన పర్యటన అనంతరం వైసీపీ భూస్థాపితమవుతుందని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ పులివెందులలో కూడా గెలవరని, ఓడిపోతారని తెలిపారు. అన్నీ తాను చెప్పినట్టుగానే జరుగుతున్నాయని అందులో ఏ మాత్రం సందేహం లేదన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమవుతుందని చెప్పానని తాను చెప్పినట్లే జరిగిందని టీడీపీ అడ్రస్ గల్లంతైందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం అవుతుందని తెలిపారు.  

దళితులు, క్రిస్టియన్లు, బీసీలు జగన్‌తో ఉన్నారనుకోవడం వట్టి భ్రమేనన్న ఆయన వారంతా జగన్ తో లేరని కేవలం వందలు, వేల కోట్లు దోచుకున్న నాయకులే జగనగ్ వెంట ఉన్నారని విమర్శించారు. అలాంటి నేతలే ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి వలసలు చేస్తున్నారని ఆరోపించారు. 

మార్చి నెలలో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలిపారు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు భారీ సంఖ్యలు ప్రజాశాంతి పార్టీలోకి వస్తారని కేఏ పాల్ తెలిపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

లక్షల కోట్ల వ్యవహారం పవన్ కు తెలుసా, అందుకే పొత్తుకు ఆఫర్ ఇచ్చా: కేఏ పాల్

నాకొక లేఖ రాస్తే ట్రంప్ ని తీసుకొచ్చి అప్పులు తీర్చేస్తా: కేసీఆర్ కి కేఏ పాల్ బంపర్ ఆఫర్