హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ్ముడితో సమానమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. పవన్ ను తాను తమ్ముడిగా భావిస్తానని అందుకే పవన్ తో పొత్తుకు ఆఫర్ పంపానని తెలిపారు. 

పవన్ కు పాలనా పరమైన విషయాలు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చన్నారు. లక్షల కోట్ల వ్యవహారం అంటే పవన్ కళ్యాణ్ కు తెలుసా అంటూ ప్రశ్నించారు. తానైతే 200 దేశాలు తిరిగి 2050 మంది బిలీనియర్లలో కనీసం 250 మంది బిలీనియర్ల నుంచి లక్షల కోట్ల ధనాన్ని తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. 

గతంలో కూడా పవన్ కళ్యాణ్ ను తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కేఏ పాల్ ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీకి కార్యకర్తలు కోట్ల స్థాయిలో ఉన్నారని ఇప్పటికే 64 లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ తనతో కలిసి పోటీ చేస్తే ఏపీని క్లీన్ స్వీప్ చెయ్యోచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేశారు కేఏ పాల్.  
 

ఈ వార్తలు కూడా చదవండి

నాకొక లేఖ రాస్తే ట్రంప్ ని తీసుకొచ్చి అప్పులు తీర్చేస్తా: కేసీఆర్ కి కేఏ పాల్ బంపర్ ఆఫర్