హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేసీఆన్ నాకొక లేఖ రాస్తే తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయిన అప్పులను తీర్చేస్తానని ప్రకటించారు. 

బుధవారం ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీసుకువచ్చి అప్పు తీర్చుతానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. 

కేసీఆర్ నాకొక లేఖ రాస్తే చాలు ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి ఏప్రిల్ 20లోగా ట్రంప్‌ను ఇండియాకు తీసుకువస్తానన్నారు. 10 బిలియన్ డాలర్లను రప్పిస్తానని ఆ మెుత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు సమంగా ఇస్తానని ప్రకటించారు. 

2,050 మంది బిలీయనీర్లలో కనీసం 200 మంది వద్ద నుంచి రెండు నెలల్లో ఈ డబ్బును తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. తన ఛాలెంజ్ కి కేసీఆర్, చంద్రబాబులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.