కాపులను బీసీల్లో చేర్చితే ఊరుకునే ప్రసక్తే  లేదు

కాపులను బిసీల్లో చేర్చే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన మంజునాథ్ కమీషన్ కు నెల్లూరులో చుక్కెదురైంది. పార్టీలకతీతంగా బీసీ సంఘాలన్నీ ఐక్యమై కమిషన్ పని మొదలుపెట్టకుండా అడ్డుకున్నాయి.

కాపులను బీసీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ మంజునాథ్ ఛైర్మైన్ బిసికమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో ఏ. కృష్ణమోహన్ కార్యదర్శిగా ఉన్నారు. ప్రొఫెసర్ వెంకటేశ్వర సుబ్రమణ్యం, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ లు సభ్యులు. కాపులను బిసిలలో చేర్చడం మీద ప్రజాభిప్రాయం సేకరించడంతో పాటు, కాపుకులానికి బిసి హోదాఇచ్చేందుకు అర్హతలున్నాయా అనేదాని మీద కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే, కమిషన్ కుప్రతిచోటా బిసిల నుంచి తీవ్రవ్యతిరేకత వస్తూ ఉంది.

ఈ క్రమంలో కమిషన్ సోమవారం నాడు నెల్లూరులోని టిటిడి కళ్యాణ మండపంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసింది. జస్టిస్ మంజునాథ్ తో సహా సభ్యులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. కొందరు కాపులు కూడా హాజరయ్యారు. అయితే పెద్ద సంఖ్యంలో అక్కడకు చేరుకున్న బీసీ సంఘాల నాయకులు, బీసీ కులాల ఉన్నట్లుండి నిరసనకు దిగారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చితే ఊరుకునే ప్రసక్తే లేదని కమిటికి చేల్చిచెప్పారు