నాటి యుపిఎ ప్రభుత్వం కసితో రాష్ట్ర విభజన చేసింది.నేను విభజన వద్దన్నా. నా మాట పెడచెవిన పెట్టి రాష్ట్ర విభజన చేశారు.అందుకే జూన్ 2, చీకటి రోజు.అయినా నేను రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతాను .
జూన్ రెండో తేదీ (జూన్ 2) ఒక చీకటి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్ణించారు.
రాష్ట్రంలో నవ్యాంధ్ర అవతరణ కార్యక్రమంలో పాల్గొంటూ నాటి యుపిఎ ప్రభుత్వం కసితో రాష్ట్ర విభజన చేసిందని చెప్పారు. ‘నేను వద్దన్నా విభజన చేశారు,’ అని ముఖ్యమంత్రి అన్నారు. అయితే, తాను రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతానని అన్నారు. దీనికోసం తాను రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షలు జరుపుతున్నానని చెప్పారు. విజయవాడలో నవ నిర్మాణ ర్యాలీ జరిగింది. బెంజి సర్కిల్ దగ్గర నవ నిర్మాణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ప్రజలందరితో ఆయన నవ నిర్మాణ దీక్షా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.

‘జూన్ 2 ఆంధ్రప్రదేశ్ కి చీకటి రోజు. జీవితంలో మరచిపోలేనిరోజు, మరచిపోకూడని రోజు’ అని చంద్రబాబు అన్నారు.
