కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశంపార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు తెలపటమేంటి?

ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ చురకలంటించారు. లోక్ సభలో టిడిపి ఎంపిల వైఖరిపై రాజ్ దీప్ మండిపడ్డారు. బడ్జెట్ సమర్పణ నేపధ్యంలో ఏపికి అన్యాయం జరిగిందని వైసిపి ఎంపిలతో పాటు టిడిపి ఎంపిలు కూడా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయంపైనే రాజ్ దీప్ మండిపడ్డారు. కేంద్రప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశంపార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు తెలపటమేంటి? అంటూ తన ట్వట్టర్ ఖాతలో ప్రశ్నించారు.

Scroll to load tweet…

ఏపికి ప్రత్యేకహోదా డిమాండ్ తో టిడిపి ఎంపిలు సభలో చేస్తున్న ఆందోళనతో సభా కార్యక్రమాలకు విఘాతం కలుగుతున్న విషయాన్ని సర్దేశాయ్ ప్రస్తావించారు. జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే టిడిపి నరేంద్రమోడి ప్రభుత్వంలో భాగస్వామా కాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? అంటూ ఎద్దేవా చేశారు. ‘వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్’ అంటూ ట్వీటారు.