కేంద్రసాయం ఏమీ అందలేదట..ఇది పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి (జెఎఫ్సి) తేల్చిన నిజం. గడచిన మూడున్నరేళ్ళల్లో కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం ఏమీ లేదని జెఎఫ్సీ తేల్చేసింది. ఏపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చామని చెబుతోంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి అందాల్సిన సాయం అందలేదని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. రెండు వాదనల్లో ఏది నిజమని తేల్చటానికి జెఎప్సీ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ కమిటి ఏర్పడింది.

రెండు ప్రభుత్వాలను లెక్కలు ఇవ్వాలంటూ పవన్ ఆమధ్య పవన్ అడిగిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం ఏమీ స్పందించలేదు. రాష్ట్రం ఏవో లెక్కలిచ్చాయని ప్రచారం జరిగింది. ఆ లెక్కలపైనే జెఎఫ్సీ అంశాల వారీగా అధ్యయనం చేసిందట. మొత్తానికి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదని తేల్చింది. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం అంతా మాయ అంటూ స్పష్టం చేసింది.

విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలు, రాష్ట్రానికి వచ్చిన విషయాలను అంశాల వారీగా పరిశీలించిందట. ముఖ్యంగా ప్రత్యేకహోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజి అంటూ కేంద్రం ఇచ్చిన హామీ ఉత్త మాయగా తేల్చేసింది. కేంద్రం ప్రకటించిన స్ధాయిలో రాష్ట్రాభివృద్ధికి నిధులు అందలేదని కమిటి స్పష్టం చేసిందట. తమ పరిశీలనను, పరిశీలన ఆధారంగా తయారుచేసిన నివేదికను కమిటి పవన్ కల్యాణ్ కు అందచేసిందట. ఇదే విషయమై బహుశా ఒకటి, రెండు రోజుల్లో పవన్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.