గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. సంక్రాంతి పర్వదినం రోజున ఆయన జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

మూర్ఖత్వంవల్లే జగన్ కాంగ్రెసుకు దూరమయ్యాడని జేసీ దివాకర్ రెడ్డి తాజాగా అన్నారు. అదే మూర్ఖత్వంతో ముఖ్యమంత్రిగా పతనమవుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నామని ఆయన చెప్పారు. 

Also Read: ఏడాది, ఏడాదిన్నరలో సీఎంగా వైఎస్ భారతి: జెసి సంచలనం

అమరావతిని ప్రశాంత యాత్రా స్థలంగా తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు ఒక వ్యక్తిపై ద్వేషంతో జనగ్ కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడని ఆరోపించారు.

Also read: నీ యబ్బ, నువ్వు చచ్చినంత ఒట్టు: జగన్ పై రేచ్చిపోయిన జేసీ దివాకర్ రెడ్డి

మనిషికి తల ఎలాంటిదో రాష్ట్రానికి రాజధాని అలాంటిదని, సచివాలయం ఎక్కడ ఉంటుందో అదే రాజధాని అని ఆయన అన్నారు. సీఎం అమరావతిలోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

See Video: జేసీ దివాకర్ రెడ్డి : కమ్మల ప్రభావం పడితే రెడ్లు సంకనాకిపోతారు...ఇదే అసలు రహస్యం.