తుళ్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తుళ్లూరులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ పార్టీలో అని, పలు మార్లు జైలుకు వెళ్ళొచ్చానని ఆయన చెప్పారు. ఇది బ్రిటిష్ పరిపాల కాదని, ఇంతమంది పోరాటం చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు అయితే స్పందించేవారని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు.ఇది రాక్షస రాజ్యమని, జగన్ ప్రభుత్వానికి మీ గోడు కనపడదని అన్నారు. 

మీరెందుకు పస్తు ఉండి దీక్ష చేస్తున్నారు, పండగ రోజు ఇలా చెయ్యడమేమిటని, చెయ్యమని ఎవరు చెప్పారని ఆయన ఆందోళనకారులతో అన్నారు. "
జగన్ మహాను భావుడు, మీ పరిస్థితి ఆయనకు అవసరం లేదుమనిషికో మాట-గొడ్డకో దెబ్బ" అని జేసీ అన్నారు. 

Also Read: రాయలసీమ పులి, జేసీ మగాడిలా మాట్లాడాడు: మాగంటి బాబు

మూర్ఖత్వం ముందు పుట్టి-తరువాత జగన్ పుట్టాడుని, 29 రోజుకు పిల్లాజల్లలోతో, ముసలిముతకతో దీక్షలు  చేస్తుంటే జగన్ కి కనపడటం లేదా అని అన్నారు. ఓ మారు మీతో జగన్ మాట్లాడితే ఏమైందని అని ఆయన అడిగారు. జగన్ ఫ్యాక్షనిస్టు లా వ్యవహరిస్తున్నాడని అన్నారు. తన తాత పోలికలు జగన్ కి వచ్చాయని, జగన్ తాత కూడా తెగ సంపాదించాలనే కోరికతో బ్రతికారని, న్యాయంగా సంపాదించడం కాదు...ఒకే సారి ఊడ్చి సంపాదించాలనేది వాళ్ళ తాత నైజమని, తాత నైజం జగన్ కి వచ్చిందని జేసీ అన్నారు, అక్రమంగా సంపాదించడమే జగన్ లక్ష్యమని ఆరోపించారు. 

151 మంది ఎమ్యెల్యేలు ఉన్నారన్న పొగరుతో రాజధాని మార్చుదామని చూస్తున్నావా అని జగన్ ను ప్రశ్నించారు. అమరావతి రాజధాని కాదంటే, గ్రేటర్ రాయలసీమ కావాల్సిందేనని, లేకుంటే నువ్వు చచ్చినంత ఒట్టు అని ఆయన అన్నారు. "జగన్నీ యబ్బ నువ్వు హైకోర రాయసీమకు ఇస్తావా...హైకోర్టు వస్తే 100 ఇళ్ళు అద్దెకు తీసుకుంటారు తప్ప.. రాయలసీమ కి ఒరిగేది ఏమి లేదు" అని అన్నారు. జగన్ కి సరైన సమాధానం కుక్క కాటుకి చెప్పుదెబ్బేనని ఆయన అన్నారు. 23న అనంతపురం లో  రాయలసీమ వాసులతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.అమరావతి అస్తిపంజరం కానివ్వమని చెప్పారు. అమరావతి రాజధాని అని రాయలసీమలో తీర్మానం చేస్తామని చెప్పారు.

Also Read: ఏడాది, ఏడాదిన్నరలో సీఎంగా వైఎస్ భారతి: జెసి సంచలనం

"యావత్తు భారత దేశం పిలుపునిద్దాం జైల్ బరో అని, ఎంత మందిని జైల్లో పెడతారో చూద్దాంధనం, అధికార, మదంతో జగన్ విర్రవిగుతున్నాడు ఒక్క చాన్స్ ఒక్క చాన్స్ అని అడుకోవడం  కాదు ప్రజల కష్టాలు కూడా తెలుసుకోవాలి" అని జేసీ అన్నారు."నరేంద్ర మోడీ దిగి వచ్చేలా మనం ధర్నాలు చెయ్యాలి. మహిళలకి మోదీ పాదాభివందనం చెయ్యాలి. నేను జేఏసీతో మాట్లాడతా.. అందరిని ఏక తాడిపైకి తెస్తా" అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.