అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి క్రింద పడిపోయారు. చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆదివారం ఉదయం మొదలైన కీలక సమావేశానికి హాజరవ్వటానికి జెసి ఉండవల్లికి వచ్చారు. ఆ సమయలో సహచరులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. జెసి క్రిందపడిపోవటాన్ని గమనించిన మిగిలిన వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు. వెంటనే వైద్యులను పిలిపించారు. హుటాహుటిన వచ్చిన వైద్యులు జెసిని పరీక్షించారు.  జెసి బిపి, షుగర్ లెవల్స్ లో కాస్త మార్పులు ఉన్నట్లు చెప్పారు. అందుకు అవసరమైన చికిత్స చేశారు. తర్వాత కాసేటప్పటికి జెసి కోలుకున్నారు. తనకు బాగానే ఉందని ఆందోళన అవసరం లేదని జెసి చెప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.