ఇది విఐపి ఎయిర్ పోర్ట్ మాయరోగం విమానాశ్రయ అధికారుల మీద  ఆగ్రహించడం ఎంపిలకు మామూలయింది ఎంపిలు, ఎమ్మెల్యే లకు విఐపి మాయరోగం తగులుకునేందుకు కారణమెవరు? 

అనంతపురం తెలుగుదేశం లోక్ సభ్యుడు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కి మళ్లీ కోపం వచ్చింది. రాజకీయాలు ఇక చాలుకుంటున్న దివాకర్ రెడ్డికి ఈ సారి రాజకీయ విఐపిహోదాయే చికాకు తెప్పించింది. శుక్రవారం విజయవాడ విమానాశ్రయ అధికారులపై ఆయన చిందులలేశారు.

అసలే దివాకర్ రెడ్డి, ఆపైన రూలింగ్ పార్టీ, అందునా ఎంపి.

హైదరాబాద్ వెళ్లేందుకు ఆయన కొద్దిగా ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే, వస్తున్న పెద్ద మనిషెవరో తెలియకుండా విమానాశ్రయ అధికారులు బోర్డింగ్ క్లోజ్ చేసి చాలా సేపయిందని చెప్పి ఆయనకు కోపం తెప్పించారు. దీనితో ఆయన ప్రయాణం రద్దయింది. నేను ప్రయాణం వాయిదా వేసుకోవాలా, నా టిక్కెట్ రద్దు చేస్తారా? అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. ధూషణకు పూనుకున్నారు.

ఎయిర్ ఇండియా కార్యాలయంలోకి దూసుకెళ్లి వీరంగం సృష్టించారు. కంప్యూటర్లను పెరికిపారేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోపోయిన పోలీసులను ఆయన వదల్లేదు. వాళ్ల మీద కూడా కన్నెర్ర చేశారు. తమాషా ఏమిటంటే, జెసి ఇలా తాండవం అడుతున్నపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు లాంజ్‌రూమ్‌లో అన్నారట.

సరే ఇది వేరే కథ.

ఎయిర్ పోర్ట్ లలో ఇలా నోరు పారేసుకుంటున్న ఈ సభ్యులెవరూ పార్లమెంటులో ఎపుడూ నోరెత్తిన పాపాన పోయుండరు. ఒక్క బిల్లు మీద నోరు మెదిపిన దాఖలాలుండవు. రోడ్ల మీద మాత్రం ఎంత హంగామా సృష్టిస్తారో. ప్రజలు గమనించాల్సిన విషయం ఇది.

ఈ దేశంలో విఐపి అనేదాన్ని పాపులిస్టు ముఖ్యమంత్రులు దేశానికి అంటించిన మాయరోగం. ఇలా ఎంతో మంది ఎయిర్ పోర్టులలో విఐపిట్రీట్ మెంటు కోసం గొడవ సృష్టించిన సంఘటలను ఉన్నాయి. సరిగ్గా ఏ డాదికిందట నవంబర్ 27 వ తేదీన రాజంపేట వైఎస్ఆర్ షి ఎంపి మిధున్ రెడ్డి తిరుపతి ఎయిర్ పోర్టులో నానా బీభత్సం సృష్టించారు. కారణం ఒకటే. విఐపి హోదా. విమానం బయలుదేరడానికి 25 నిమిషాల ముందు మిథున్ రెడ్డి తన పరివారంలో విమానాశ్రయానికి వచ్చాడు. ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అప్పటికే బోర్డింగ్ క్లోజ్ అయింది. విమనాంలోకి మిథున్ ను, ఆయన అనుచరులను అనుమతించడం కాదన్నారు. అంతే ఆయన లో దాక్కుని ఉన్న విఐపి ఉగ్ర నరసింహుడిలాగా బయటకొచ్చి’ నిన్ను నంజుకు తింటన్రా’అంటూ మేనేజర్ మీద దాడి చేశారు. ఇది పెద్ద రభసకు దారి తీసింది. కేసు బుక్కయింది. అరెస్ట్ వారంట్ ఇచారు. కేసుఏమవతుందనేదాని కంటే, ఎయిర్ పోర్ట్ లలోమన ప్రజాప్రతినిధులు కోరుతున్న విఐపి హోదా జులుంను హర్షించలేం.

ఎంపిలు, శాసన సభ్యులు శాసన నిర్మాణం కోసం ప్రజలు ఎన్నుకున్నవారు. రాజకీయాలను భ్రస్టు పట్టించిన ముఖ్యమంత్రులు శాసన సభ్య వ్యవస్థను పూర్తిగా కలుషితం చేశారు. వాళ్లని కేవలం చట్టాలు చేసే శాసన సభ్యలు (పార్లమెంటు సభ్యులు) గాఉంచకుండా వాళ్లకి రకారకాల తాయిలాచ్చి, మచ్చిక చేసుకునేందుకు నిధులిచ్చి శాసన సభలో కొరగాకుండా పబ్లీకున మాత్రం విఐపి దురుసు తనం ప్రదర్శించే లా చేశారు. ఎయిర్ పోర్ట్ లలో ఇలా నోరు పారేసుకుంటున్న ఈ సభ్యులెవరూ పార్లమెంటు నోరెత్తిన పాపాన పోయుండరు. ఒక్క బిల్లు మీద మాట్లాడిన దాఖలాలుండవు. రోడ్ల మీద మాత్రం ఎంత హంగామా సృష్టిస్తారో. ప్రజలు గమనించాల్సిన విషయం ఇది.