విజయవాడ నగరంలో ఫ్లెక్సీల గొడవ ముదురుతోంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ ని విమర్శిస్తూ జనసేన, పవన్ ని విమర్శిస్తూ టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ నేతలు మండిపడుతున్నారు.

అధికారుల వ్యవహారాన్ని నిరసిస్తూ.. మంగళవారం జనసేన పార్టీ నేతలు.. నగర మేయర్ కోనేరు శ్రీధర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నగరంలో కేవలం టీడీపీ నేతల ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారని.. ఇతర పార్టీ నేతల కటౌట్లకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.

అధికారులను ఎదురిచి ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా.. 24గంటల్లోపు వాటిని తొలగిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ నగరం టీడీపీ నేతల సొత్త అంటూ వారు ప్రశ్నించారు. 

read more news

టార్గెట్ టీడీపీ.. విజయవాడలో జనసేన ఫ్లెక్సీల కలకలం

బెజవాడలో ఫ్లెక్సీ ఫైట్:పవన్ ను విమర్శిస్తూ కాట్రగడ్డ బాబు పోస్టర్లు