విజయవాడలో ఫ్లెక్సీల కలకలం రేగుతోంది. టీడీపీ నేత కాట్రగడ్డ బాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ.. విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఫ్లెక్సీకి పోటీగా.. జనసేన నేత మండలి రాజేష్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

పవన్ కళ్యాణ్ తీరును విమర్శిస్తూ కాట్రగడ్డ బాబు గత నెల రోజులుగా విజయవాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దానికి ప్రతిగా ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావటం కలకలం రేపింది. 

2009లో టీడీపీ పరిస్థితి ఏమిటి... 2014లో అధికారంలోని కారణం ఏమిటో తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీలు పోటాపోటీగా వెలుస్తుండటంతో పోలీసులు దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల నేతల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్త

బెజవాడలో ఫ్లెక్సీ ఫైట్:పవన్ ను విమర్శిస్తూ కాట్రగడ్డ బాబు పోస్టర్లు