కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒక్క బియ్యం స్మగ్లింగ్‌తోనే ద్వారంపూడి రూ.15 వేల కోట్లు సంపాదించాడని జనం చెబుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. 

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం వారాహి విజయయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అండ చూసుకుని ద్వారంపూడి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రశేఖర్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమంత్రని ఇక్కడి జనం అంటున్నారని పవన్ సెటైర్లు వేశారు. 1800వ సంవత్సరంలో బర్మా వెళ్లి డబ్బు సంపాదించిన సత్యలింగ నాయకర్.. ఆ డబ్బుతో కాకినాడ ప్రాతంలో అన్ని కులాల వారీకి కాలేజీలు పెట్టారని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే ఈ స్థలాలను కూడా ద్వారంపూడి కొట్టేశాడని.. ఏ మూలకు వెళ్లినా చంద్రశేఖర్ రెడ్డి దోపిడీయే కనిపిస్తుందని ఆయన దుయ్యబట్టారు. 

మంగళగిరిలోనే వుంటానని.. ఏ గూండా వస్తాడో రమ్మనండి అంటూ పవన్ హెచ్చరించారు. ఈ రౌడీ, గుండా చంద్రశేఖర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వనని తెలిపారు. ఒక్క బియ్యం స్మగ్లింగ్‌తోనే ద్వారంపూడి రూ.15 వేల కోట్లు సంపాదించాడని జనం చెబుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. క్రైమ్‌కు పాల్పడిన వాడు ఏ కులమైనా వదిలేది లేదని.. ప్రజలకు భద్రత వుండాలి, కుల చిచ్చు లేకుండా వుండాలని కోరుకుంటున్నానని జనసేనాని చెప్పారు. యువత కులాలకు అతీతంగా వుండాలని.. వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపి డెడ్ బాడీని ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. 

ALso Read: ఒళ్లు కొవ్వెక్కి కోట్టుకుంటున్నాడు.. కోన్‌కిస్కాగాడు .. ద్వారంపూడిని ఈసారి గెలవనివ్వను: పవన్ కళ్యాణ్

ఏ గూండా వచ్చినా సరే మీ ప్రాణాలకు తాను అడ్డుగా వుంటానని పవన్ తెలిపారు. బాపట్ల జిల్లాలో తన అక్కను వేధిస్తున్నాడని ప్రశ్నించినందుకు ఓ బాలుడిని తగులబెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారాయో చెప్పొచ్చన్నారు. కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు కానీ.. కులాన్ని మాత్రం ఎదగనీయడం లేదని పవన్ ఆరోపించారు. కులాన్ని దాటి చూడకుంటే ఆంధ్రప్రదేశ్ సర్వ నాశనమేనని జనసేనాని హెచ్చరించారు.