బ్రాందీని బొర్న్ వీటాలా ప్రమోట్ చేస్తారేమో: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు
భవిష్యత్తులో వైసీపీ నేతలు విస్కీని ప్రోటిన్ షేక్‌గా.. బ్రాందిని బొర్న్‌వీటాలా ప్రమోట్ చేస్తారంటూ పవన్ సెటైర్లు వేశారు. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం దాచేస్తోందని.. దీనిని చూస్తుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు.
రాజధాని అమరావతిని చాలా లోతుగా చూడాలని పవన్ స్పష్టం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయని.. కానీ మనకు మాత్రం లేదన్నారు.
కర్నూలు తర్వాత 50, 60 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్‌ను నిర్మించామన్నారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత మనల్ని తరిమేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని ప్రకటించేటప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్.. ఆ నిర్ణయంతో ఏకీభవించారని పవన్ గుర్తు చేశారు.
రాజధాని అంటే 33 వేల ఎకరాలు, 26 వేలమంది రైతులు కాదని.. 5 కోట్లమంది ఆంధ్రుల ఆత్మగౌరవమన్నారు. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు గందరగోళాన్ని సృష్టించాయని పవన్ ఎద్దేశా చేశారు.
అమరావతి సంబంధించి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేదని బొత్స చెబుతున్నారని.. మరి మీరు నోటిఫికేషన్ ఇవ్వొచ్చు కదా అని జనసేనాని సూచించారు. దేశ ప్రధానమంత్రితో పాటు అన్ని పార్టీలు అమరావతిని రాజధానిగా గుర్తించిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ గందరగోళం ఏంటని పవన్ మండిపడ్డారు.
రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.8,218 కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ డబ్బంతా ఎవరు కడతారని జనసేన అధినేత ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంపై వీరికి ప్రేమ ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు.
రైతులు విత్తనాల కొరతతో ఇబ్బందిపడుతున్నారని.. ఇద్దరు అన్నదాతలు క్యూలైన్‌లో నిలబడలేక చనిపోయారని గుర్తుచేశారు. విత్తనాలు ఇవ్వకపోగా.. కొందరు మంత్రులు వెటకారంతో వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. మరి ఒక తల్లికి ఇద్దరు, ముగ్గురు బిడ్డలుంటే వారి పరిస్థితేంటని పవన్ ప్రశ్నించారు. ఈ విధానం ద్వారా పిల్లల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టేలా చేస్తోందన్నారు.
భవిష్యత్తులో వైసీపీ నేతలు విస్కీని ప్రోటిన్ షేక్‌గా.. బ్రాందిని బొర్న్‌వీటాలా ప్రమోట్ చేస్తారంటూ పవన్ సెటైర్లు వేశారు. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం దాచేస్తోందని.. దీనిని చూస్తుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదన్నారు.
బ్రాందీని బొర్న్ వీటాలా ప్రమోట్ చేస్తారేమో: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు
కోడి కత్తి, వివేకా హత్య కేసులపై... పవన్ ఆసక్తికర కామెంట్స్
గ్రామాల నాశనానికే... గ్రామవాలంటీర్ల వ్యవస్థ: పవన్
రాష్ట్ర ప్రభుత్వమంటే... సిమెంట్ ఫ్యాక్టరీ కాదు: జగన్‌పై పవన్ విసుర్లు
పథకాలు జనరంజకం.. కానీ పాలన జనవిరుద్ధం: జగన్‌పై పవన్ సెటైర్లు
జగన్ పాలనపై 6 నెలల వరకు స్పందించదలచుకోలేదు.. కానీ: పవన్