జగన్ పాలనపై 6 నెలల వరకు స్పందించదలచుకోలేదు.. కానీ: పవన్
వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివేదిక విడుదల చేశారు. 9 అంశాలతో 33 పేజీలతో నివేదిక రూపొందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నివేదికను విడుదల చేశారు.
వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివేదిక విడుదల చేశారు. 9 అంశాలతో 33 పేజీలతో నివేదిక రూపొందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. నివేదికను రూపొందించేందుకు విశేషంగా కృషి చేసిన రీసెర్చ్ అండ్ పాలసీ విభాగానికి, మీడియా విభాగానికి, జనసేన యువనాయకులకు, పీఏసీ సభ్యులకు, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
కొన్ని దశాబ్ధాలుగా దేశ రాజకీయ సమాజాన్ని గమనించానని పవన్ తెలిపారు. రాజకీయ లాభాపేక్ష వచ్చినా రాకపోయినా, మనవంతు సేవ దేశానికి చేయాలనే లక్ష్యంతోనే జనసేన పార్టీని స్థాపించినట్లు పవన్ స్పష్టం చేశారు.
తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఎందుకింత బలంగా నిలదొక్కుకోగలిగామంటే దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని.. అందుకే ఓటమి తమను ఏం చేయలేకపోయిందన్నారు.
ప్రతిపక్ష పార్టీ అంటే అధికారపక్షాన్ని ప్రతి విషయంలో తిట్టడం కాదని.. సంపూర్ణమైన అవగాహనతో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని జనసేనాని పేర్కొన్నారు. ఎన్నికల్లో 151 సీట్లొచ్చిన వైసీపీ గురించి మాట్లాడాల్సిన అవకాశం ప్రతిపక్షాలకు ఒక ఆరు నెలల వరకు రాదనుకున్నా అన్నారు.
అయితే మూడు వారాల్లోపే వారు తీసుకున్న నిర్ణయాలు.. ప్రజలను ఇబ్బందిపెట్టేవిగా మారాయని పవన్ ఎద్దేవా చేశారు. ప్రజలను కలవరపరిచి, రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థం చేసేలా మూడున్నర నెలల్లో జగన్ తీసుకున్నారని పవన్ మండిపడ్డారు.